బలగం సినిమాతో మంచి పేరు తెచ్చుకున్న దర్శకుడు వేణు యెల్దండి ఇప్పుడు తన రెండో సినిమా “యెల్లమ్మ” ను అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమాకు సంబంధించిన ఒక చిన్న గ్లింప్స్ వీడియో కూడా విడుదల చేయబోతున్నారు.
ఈ సినిమాలో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది ఏమిటంటే.
దేవిశ్రీప్రసాద్(DSP) ఈ సినిమాలో హీరోగా నటించబోతున్నారు. మ్యూజిక్ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్న DSP ఇప్పుడు నటుడిగా ఎలా కనిపిస్తాడో చూడాలని ప్రేక్షకుల్లో ఆసక్తి పెరిగింది.
సినిమా షూటింగ్ వచ్చే ఏడాది ప్రారంభంలో మొదలయ్యే అవకాశం ఉంది. హీరోయిన్ ఎవరో ఇంకా ఖరారు కాలేదు. ముందుగా కొంతమంది పెద్ద హీరోయిన్ల పేర్లు వినిపించినా, ఫైనల్ డిసిషన్ మాత్రం ఇంకా రావాల్సి ఉంది.
మొత్తానికి,
బాలగం తర్వాత వేణు యెల్దండి తీస్తున్న సినిమాకావడంతో, “యెల్లమ్మ”మీద అంచనాలు ఎక్కువగా ఉన్నాయి.
గ్లింప్స్ రిలీజ్ అయిన తర్వాత ఈ సినిమాపై ఇంకా క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.