అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరలు పెద్ద ఎత్తున పెరిగితే మాత్రమే భారత్‌పై ప్రత్యక్ష ప్రభావం కనిపిస్తుందని. ప్రస్తుతం భారత్ తన ముడి చమురు అవసరాల్లో ఎక్కువ భాగం సౌదీ, ఇరాక్, రష్యా వంటి దేశాల నుంచి దిగుమతి చేసుకుంటోంది.
అందువల్ల వెనిజులా సరఫరా అంతరాయం జరిగినా తక్షణ లోటు ఏర్పడే పరిస్థితి లేదు.
అదే సమయంలో, జియోపాలిటికల్ టెన్షన్స్ కారణంగా మార్కెట్లలో అస్తిరత పెరిగే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు.
రూపాయి–డాలర్ మారకం విలువ, స్టాక్ మార్కెట్లు స్వల్పకాలంలో ప్రభావితమయ్యే అవకాశం ఉన్నప్పటికీ, దీర్ఘకాలిక ప్రభావాలు పరిమితంగానే ఉంటాయని విశ్లేషకులు పేర్కొంటున్నారు.
మొత్తానికి, మదురో అరెస్ట్ అంతర్జాతీయంగా పెద్ద రాజకీయ పరిణామమే కాని, భారత ఆర్థిక వ్యవస్థకు దీనివల్ల పెద్ద ప్రమాదం లేదని నిపుణుల అభిప్రాయం.