Tuesday, May 5, 2026
HomeNewsSportsMalaysia Open 2026: నేటి నుంచి మలేషియా ఓపెన్...

Malaysia Open 2026: నేటి నుంచి మలేషియా ఓపెన్…

Published on

గత ఏడాది నిరాశపరిచిన భారత షట్లర్స కొత్త సీజన్‌కు సిద్ధమయ్యారు. నేటి నుంచి జరగే మలేషియా ఓపెన్ సూపర్ 1000 టోర్నీలో బరిలో దిగనున్నారు.

మెన్స్‌ సింగిల్స్‌లో కిదాంబి శ్రీకాంత్, లక్ష్యసేన్, ప్రణయ్ పోటీలో పాల్గొంటారు. ఉమెన్స్‌ సింగిల్స్‌లో పీవీ సింధు బరిలోకి దిగుతోంది. డబుల్స్‌లో సాత్విక్–చిరాగ్ జోడీ, పునీత జోడీ సహా పలువురు భారత క్రీడాకారులు ఆడనున్నారు.

అక్టోబర్ తర్వాత సింధు ఆడబోయే మొదటి టోర్నీ ఇదే కావడంతో ఆమె ఎలా రాణిస్తారో చూడాలి. టోర్నీలో తొలి రౌండ్ల నుంచే కఠినమైన పోటీలు ఎదురుకానున్నాయి.

ప్రపంచ ర్యాంకింగ్స్‌ను దృష్టిలో పెట్టుకుని ఈ టోర్నీ కీలకంగా భావిస్తున్నారు. మంచి ప్రదర్శన కనబరిస్తే రాబోయే ఆల్ ఇంగ్లాండ్, ఇండోనేషియా ఓపెన్లలో సీడింగ్ అవకాశాలు మెరుగయ్యే అవకాశం ఉంది.

Also Read  Malaysia open:సెమీస్‌కు పీవీ సింధు..

Latest articles

Malaysia open:సెమీస్‌కు పీవీ సింధు..

మలేషియా ఓపెన్‌లో భారత స్టార్ బ్యాడ్మింటన్ ప్లేయర్ పీవీ సింధు సెమీఫైనల్‌కు దూసుకెళ్లింది. క్వార్టర్ ఫైనల్లో జపాన్ ప్లేయర్...

More like this

Viswambhara :జులై 10న చిరంజీవి ‘విశ్వంభర’ రిలీజ్?

మెగాస్టార్ అభిమానులు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న భారీ ఫాంటసీ చిత్రం విశ్వంభర విడుదలపై ఎట్టకేలకు క్లారిటీ వచ్చినట్లు సినీ వర్గాలు...

Shankar Drea Project: నిర్మాత… కానీ కఠిన నిబంధనలతో!

భారతీయ సినీ పరిశ్రమలో విజువల్ గ్రాండియర్‌కు కేరాఫ్ అడ్రెస్‌గా నిలిచిన దర్శకుడు శంకర్ ఎప్పటినుంచో కలగా భావిస్తున్న ప్రాజెక్ట్...

Champion Movie:OTTలోకి వచ్చేసిన ‘ఛాంపియన్’ మూవీ

యువ హీరో రోషన్ ప్రధాన పాత్రలో నటించిన పీరియాడిక్ యాక్షన్ డ్రామా ఛాంపియన్ ఇప్పుడు OTTలోకి వచ్చేసింది. గత...