దేశంలో తొలి వందే భారత్ స్లీపర్ ట్రైన్‌ను జనవరి 17న ప్రారంభించనున్నారు. గుజరాత్–కర్ణాటక రూట్‌లో ఈ ట్రైన్‌ను తొలిసారిగా పరుగులు పెట్టించేందుకు సిద్ధమవుతున్నారు.
18 కోచ్‌లతో రూపొందించిన ఈ ట్రైన్‌లో మొత్తం 823 మంది ప్రయాణికులు ప్రయాణించవచ్చు. ఆధునిక సౌకర్యాలు, అత్యాధునిక భద్రతా వ్యవస్థలు, ఆటోమేటిక్ డోర్లు, మెరుగైన బెర్త్ డిజైన్ వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి.
మధ్యతరగతి ప్రయాణికుల కోసం టికెట్ ధరలు రూ.2,300 నుంచి రూ.3,600 మధ్య ఉండనున్నట్లు సమాచారం. గంటకు 180 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే సామర్థ్యం ఉన్న ఈ స్లీపర్ ట్రైన్, రాత్రి ప్రయాణాలను మరింత సౌకర్యవంతంగా మార్చనుందని రైల్వే అధికారులు తెలిపారు.