‘రాజాసాబ్’ సినిమాకు పార్ట్-2 ఉంటుందని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. పార్ట్-2 టైటిల్‌ను ‘రాజాసాబ్ సర్వీస్: 1935’ గా ఖరారు చేసినట్లు సమాచారం. ఈ సీక్వెల్ కథనం 1935 కాలంలో జరిగే సంఘటనల నేపథ్యంలో ఉండనుందని తెలుస్తోంది.
ఇందులో ఫ్యాన్స్ జోకర్ లుక్‌లో కనిపించనున్నారని టాక్ నడుస్తోంది. ఇప్పటివరకు విడుదలైన టీజర్‌కు మంచి స్పందన రావడంతో పార్ట్-2పై అంచనాలు మరింత పెరిగాయి. ముఖ్యంగా డార్క్ థీమ్, పవర్‌ఫుల్ స్క్రీన్‌ప్లే, కొత్త క్యారెక్టర్ ఆర్క్స్‌తో కథను ముందుకు తీసుకెళ్లనున్నారని చిత్ర వర్గాలు చెబుతున్నాయి.
కాగా పార్ట్-1తో పోలిస్తే పార్ట్-2 మరింత గ్రాండ్ స్కేల్‌లో ఉండబోతుందని, విజువల్స్‌తో పాటు బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ప్రత్యేక ఆకర్షణగా నిలవనుందని సమాచారం. త్వరలోనే పార్ట్-2కు సంబంధించిన షూటింగ్ షెడ్యూల్, రిలీజ్ డేట్‌పై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాలు వెల్లడిస్తున్నాయి.