ఒకే ఏడాది 8 సినిమాలతో సంచలనం సృష్టించిన శ్రీలీల, చెప్పుకోదగ్గ హిట్లు లేక ప్రస్తుతం సతమతమవుతోంది. తెలుగులో గత ఏడాది చేసిన సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాయి.
ఈ ఏడాది కొత్త ఆశలతో తమిళంలో ఎంట్రీ ఇచ్చినా, శివ కార్తికేయన్ సరసన నటించిన ‘పరాశక్తి’ మూవీ తాజాగా విడుదలై ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది. దీంతో కోలీవుడ్లో ఆమెకు కొత్త ఆఫర్లు రావడం కష్టమేనని ఇండస్ట్రీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
ఈ పరిస్థితుల్లో శ్రీలీల చూపంతా ఇప్పుడు బాలీవుడ్‌పైనే ఉంది. కార్తీక్ ఆర్యన్‌తో నటిస్తున్న హిందీ సినిమా ఆమె కెరీర్‌కు టర్నింగ్ పాయింట్ అవుతుందనే ఆశలు పెట్టుకున్నట్లు సమాచారం.
సరైన హిట్ పడితే మళ్లీ టాప్ హీరోయిన్ల జాబితాలోకి రావచ్చని, లేదంటే కెరీర్ మరింత క్లిష్టంగా మారే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు అంటున్నారు. అభిమానులు మాత్రం ఆమెకు ఒక సాలిడ్ హిట్ తప్పకుండా రావాలని కోరుకుంటున్నారు.