ఇక ఫుడ్ ఆర్డర్ చేయాలంటే తప్పనిసరిగా స్విగ్గీ యాప్ ఓపెన్ చేయాల్సిన అవసరం ఉండకపోవచ్చు. త్వరలోనే Swiggy ఒక కొత్త టెక్నాలజీని ప్రవేశపెట్టబోతోంది. దీని ద్వారా ChatGPT లేదా Gemini లాంటి AI చాట్‌బాట్లతోనే ఫుడ్ ఆర్డర్లు, సరకుల డెలివరీలు చేయడం సాధ్యమవుతుంది. అంటే యాప్‌ల మధ్య తిరగాల్సిన పనిలేదు చాట్ చేస్తూనే మీ పని అయిపోతుంది.
ఈ సౌకర్యం ‘మోడల్ కాంటెక్స్ట్ ప్రోటోకాల్’ (Model Context Protocol) ఆధారంగా పనిచేస్తుంది. ఈ టెక్నాలజీ వల్ల AI చాట్‌బాట్‌లు నేరుగా స్విగ్గీ సిస్టమ్‌లతో కనెక్ట్ అవుతాయి. మీరు “ఇవాళ చికెన్ బిర్యానీ ఆర్డర్ చేయి” లేదా “రేపటి కిరాణా సరుకులు తెప్పించు” అని ఒక సింపుల్ ప్రాంప్ట్ ఇస్తే చాలు. మిగతా మొత్తం ప్రాసెస్ రెస్టారెంట్ ఎంపిక, అడ్రస్ కన్ఫర్మేషన్, పేమెంట్, డెలివరీ ట్రాకింగ్ all ఇవన్నీ AI ఏజెంట్లే యూజర్ తరఫున పూర్తి చేస్తాయి.
దీని వల్ల యూజర్లకు టైమ్ సేవ్ అవుతుంది, యాప్‌లు ఓపెన్ చేసి ఆప్షన్లు వెతకాల్సిన అవసరం ఉండదు. ముఖ్యంగా వాయిస్ లేదా చాట్ ద్వారా ఆర్డర్ చేసే అలవాటు ఉన్నవాళ్లకు ఇది పెద్ద ప్లస్. టెక్నాలజీ సరిగ్గా అమలైతే, భవిష్యత్తులో ఫుడ్ డెలివరీ అనేది యాప్ ఆధారంగా కాకుండా AI అసిస్టెంట్ల చుట్టూ తిరిగే అవకాశం ఉంది. సింపుల్‌గా చెప్పాలంటే ఒక ప్రాంప్ట్, ఒక కమాండ్ మీ భోజనం మీ తలుపు దగ్గర!