నటి మోహిని టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్నారు, అంతేకాదు స్టార్ హీరోల సరసన సూపర్ హిట్ చిత్రాల్లో నటించారు. ముఖ్యంగా బాలయ్య బాబుతో ఆమె నటించిన ఆదిత్య 369 సినిమా ఆమె కెరియర్ లో ఓ సూపర్ హిట్ చిత్రం. ఇక చిరంజీవి మోహన్ బాబు ఇలా స్టార్ హీరోల సినిమాల్లో నటించారు. ఆమెకి తొలి సినిమా ఆదిత్య 369. ఇక సౌత్ లో అన్నీ భాషల్లో ఆమె సినిమాలు చేశారు, అందంతో పాటు సినిమాల్లో అభినయంతో ఆకట్టుకున్నారు. మలయాళంలో ఆమె ఎక్కువగా సినిమాలు చేశారు. ఈ సమయంలో ఆమెకి వివాహం జరిగింది.
ఇద్దరు పిల్లలు పుట్టినా సినిమా చేశారు. తర్వాత సినిమాలకు పూర్తిగా దూరమయ్యారు.
నటి మోహిని చాలాకాలం తర్వాత ఓ ఇంటర్వ్యూకు హాజరైంది. ఈ సమయంలో గతంలో జరిగిన విషయాలు సినిమా జ్ఞాపకాలను పంచుకుంది. దర్శకుడు ఆర్కే సెల్వమణి కన్మణి తమిళ సినిమాలో ఉడాల్ తళువా అనే పాటని స్విమ్మింగ్ పూల్ లో ప్లాన్ చేశారు, అయితే ఆమెకి ఈత రాదు, స్విమ్ సూట్ వేసుకోవాలి తనకి చాలా అసౌకర్యం అనిపించిందట, ముందు తాను చేయను అని చెప్పి అందరి ముందు ఏడ్చారట. తన వల్ల కాదు అని బాధఫడ్డారట.
అప్పట్లో ఈత నేర్పించడానికి ఆడవాళ్లు లేరు, మగవాళ్లే ఉన్నారు. వాళ్ల ముందు సగం బట్టలే వేసుకుని ఈత నేర్చుకోవడానికి ఎంతో ఇబ్బందిగా అనిపించింది. కానీ చివరకు ఈ సాంగ్ ఇలా బలవంతంగా సగం దుస్తులు వేయించి సాంగ్ చేయించారు అని తెలిపింది. తర్వాత ఊటీలో మళ్లీ అలాంటి సీన్ చేయాలన్నారు అప్పుడు నేను చేయలేదు. అయితే నాకు ఇష్టం లేకుండా ఆ సీన్ చేశాను. మరీ గ్లామరస్‌గా కనిపించింది ఈ కన్మణి సినిమాలోనే అనే విషయాలు ఆమె తెలిపారు.
ఇక ఎన్నో సూపర్ హిట్ చిత్రాలు తనకు దూరం అయ్యాయి అనే విషయం కూడా తెలిపారు మోహిని.
సూర్య సన్నాఫ్ కృష్ణన్ చిత్రంలో ముందు సిమ్రాన్ బదులు ఆమెని సంప్రదించారు. కానీ ఆమె సినిమాలు మానేశారు అని ఎవరో డైరక్టర్ కి చెప్పడంతో సిమ్రాన్ ని తీసుకున్నారు. దర్శకుడు గౌతమ్ వాసుదేవ్ మీనన్ ఒకసారి కలిసిన సమయంలో ఈ విషయం చెప్పారట.
రజనీకాంత్ ముత్తు సినిమాలో హీరోయిన్‌గా నన్ను తీసుకోవాలా? మీనాను తీసుకోవాలా అని దర్శక నిర్మాతలు ఆలోచనలో ఉన్నారు. ఒకసారి కలవమన్నారు నేను ఇలా పని కావాలి అని అడగడం ఇష్టం లేక సినిమా అవకాశం వదులుకున్నా ఫైనల్‌గా మీనాను సెలక్ట్ చేశారు. చిన్న తంబి కూడా నా డేట్స్ సెట్ కాక వదులుకున్నా అని తెలిపింది. కుటుంబంలో కూడా కొన్ని ఇబ్బందులు పడ్డాను నా భర్త కజిన్ నాపై చేతబడి చేయించింది. అప్పుడు నన్ను ఆ భగవంతుడే కాపాడాడు అని తెలిపింది మోహిని.
ఆదిత్య 369 లో బాలయ్య సరసన నటించింది ఆమె.అలాగే చిరంజీవి చెల్లెలుగా హిట్లర్ సినిమాలో నటించింది.
మోహన్‌బాబు, మమ్ముట్టి, మోహన్‌లాల్ తో నటించారు. చెప్పాలంటే 1990లో కుర్రకారుకి డ్రీమ్ గర్ల్‌గా పేరు పొందింది ఈ అందాల భామ. మొత్తం సౌత్ సినిమా పరిశ్రమలో అన్నీ భాషల్లో 100కి పైగా చిత్రాల్లో నటించింది మోహిని. ఇక ఆమె చివరగా మలయాళ సినిమా సురష్ గోపీ హీరోగా వచ్చిన కలెక్టర్ చిత్రంలో నటించింది. 2011లో ఈ సినిమా విడుదలైంది. తర్వాత ఆమె సినిమాలు చేయలేదు. సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టి ఆమె సినిమాల్లో నటించాలి అని ఆమె అభిమానులు కోరుకుంటున్నారు.