సినిమా ఇండస్ట్రీలో కొత్త నటులకి కొదవ లేదు. చాలా మంది తమ టాలెంట్ ని సినిమా ఇండస్ట్రీలో చూపిస్తున్నారు.
ముఖ్యంగా కొత్త వారికి ఓటీటీ సరైన వేదిక అవుతోంది. ఓటీటీలో విడుదల అవుతున్న కొన్ని సినిమాలు వెబ్ సిరీస్ ల ద్వారా మరింత ఫేమ్ పొందుతున్నారు. ఇటీవల ఓ 50 సినిమాలు దియేటర్లో వస్తే 150 సినిమాలు నేరుగా ఓటీటీలో రిలీజ్ అవుతున్నాయి, ఇక ధియేటర్ రన్ పూర్తి అయిన తర్వాత కూడా ఆ సినిమాలు ఓటీటీలో సందడి చేస్తున్నాయి. తాజాగా ఆదిత్య విక్రమ వ్యూహ ఈ సినిమా ఆహా ఓటీటీలో నేరుగా విడుదలైంది. ఈ సినిమా ఆహాలో క్రైమ్ సస్పెన్స్ కేటగిరిలో సందడి చేస్తోంది. ఈ సినిమాకి శ్రీ హర్ష దర్శకత్వం వహించారు.
స్టోరీ
హీరో విక్రమ్ చిన్నతనంలోనే తన తల్లిని కోల్పోతాడు. తండ్రి స్కూల్ టీచర్, ఉద్యోగం మానేసి తర్వాత కొన్ని సంవత్సరాలుగా ఇంట్లోనే ఉంటాడు. విక్రమ్ కూడా పెద్దగా చదువుకోడు కాని చాలా తెలివైన వ్యక్తి. ముఖ్యంగా చిన్నతనం నుంచి క్రైమ్ సీరియల్ సిరీస్ ఈ విషయాల్లో చాలా తెలివిగా ఆలోచిస్తూ ఉంటాడు. యువకుడు అయిన తర్వాత ఆధారాల ద్వారా ఆ నేరస్థులు ఎవరనేది చెబుతూ పోలీసులకు సహకరిస్తూ ఉంటాడు. ఈ టైమ్ లో సీనియర్ పోలీస్ ఆఫీసర్ విక్రమ్ తో మాట్లాడుతూ సిటీలో జరుగుతున్న హత్యల గురించి చెబుతాడు.
అక్కడ హత్య చేసిన తర్వా త కిల్లర్ ఓ పెయింట్ డబ్బా వదిలిపెడుతుంటాడు.. ఈ కిల్లర్ ని పెయింటర్ అని పిలుస్తూ ఉంటారు. ఈ కిల్లర్ ప్యాట్రన్ కూడా చాలా ఢిఫరెంట్ గా ఉంటుంది. ఏడాదిలో ఒక వారం రోజులు మాత్రమే ఇలా వరుస హత్యలు చేస్తాడు. ఈ కిల్లర్ ని పట్టుకుంటే 15 లక్షల రివార్డు ఇస్తాము అంటారు పోలీసులు. దీంతో విక్రమ్ ఆ 15 లక్షల డబ్బుల కోసం ఈ కిల్లర్ ని పట్టుకునేందుకు ప్రయత్నం చేస్తాడు.
ఇక పోలీస్ ఆఫీసర్ ఆదిత్యతో ఈ కేసు డీల్ చేస్తాడు. అప్పటికే కిల్లర్ ఒక హత్య చేసి పారిపోతాడు. అతను మరో హత్య చేయకుండా వీరు ఆ కిల్లర్ ని పట్టుకునేందుకు ప్రయత్నం చేస్తారు. మరి ఈ కిల్లర్ ఎవరు, ఎందుకు ఇలా హత్యలకు పాల్పడుతున్నాడు, చివరకు ఆ కిల్లర్ దొరికాడు అనేది ఈ స్టోరీ.
పోలీస్ ఆఫీసర్, ఈ కిల్లర్, అలాగే విక్రమ్ వీరి మధ్య ఈ కథ తిరుగుతుంది. విచారణ ఏ విధంగా సాగింది అనేది స్క్రీన్ ప్లే చాలా బాగా చూపించారు. ఈ కిల్లర్ ని పట్టుకునేందుకు ఎలాంటి ఎత్తుగడలు వేశారు అనేది ఆద్యంతం బాగుంది.
ఇక సన్నివేశాలు ఆసక్తి కలిగించేలా ఉన్నాయి.
అయితే బలమైన కథ కాదు అనే చెప్పాలి.
కాస్త డైలాగ్స్ విషయంలో ఇంకాస్త జాగ్రత్త తీసుకోవాల్సింది
ఆర్టిస్టుల నుంచి సరైన అవుట్ పుట్ వచ్చింది నటనలో అందరూ చాలా బాగా చేశారు
సెకండాఫ్ కాస్త ఇంట్రస్ట్ పెరిగేలా దర్శకుడు కథ మలిచారు.
నేపథ్య సంగీతం,ఎడిటింగ్ బాగుంది.
సో డిఫరెంట్ టైలిల్ దీని బట్టి ఇద్దరు వ్యక్తుల వ్యూహం అనేది మనకు ఈజీగా అర్దం అవుతుంది. సో టైటిల్ కి తగ్గట్లు ఇద్దరి పాత్రలు సినిమాలో హైలెట్ అయ్యాయి. ఇక కిల్లర్ని పట్టుకునే సీన్లు ఆకట్టుకున్నాయి, మొత్తానికి ఈ వారం ఓటీటీలో మూవీ లవర్స్ కి ఈ సినిమా బాగా నచ్చుతుందనే చెప్పాలి.