నందమూరి బాలకృష్ణ నటించిన ‘అఖండ-2’ సినిమా ఓటిటి రిలీజ్ డేట్ ఖరారైనట్లు సమాచారం. ఈ నెల 9 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌కు వచ్చే అవకాశం ఉన్నట్టు టాలీవుడ్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. థియేటర్లలో ఇంకా కొన్ని చోట్ల ప్రదర్శనలు కొనసాగుతూనే ఉండగా, ఓటిటికి కూడా త్వరగా రానుండటం ఫ్యాన్స్‌లో ఉత్సాహం కలిగిస్తోంది.
బోయపాటి శ్రీను దర్శకత్వం వహించిన ఈ చిత్రం భారీ అంచనాల మధ్య డిసెంబర్ 12న థియేటర్లలో విడుదలైంది. మాస్ యాక్షన్ సన్నివేశాలు, బాలయ్య పాత్రధారణ, థీమ్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా మారాయి. ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా రూ.120 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించినట్లు ట్రేడ్ టాక్.
ఓటిటిలో రిలీజ్ అయ్యాక ఫ్యామిలీ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున చూసే అవకాశముందని డిజిటల్ ప్లాట్‌ఫాంలు భావిస్తున్నాయి. నిర్మాతలు కూడా త్వరలో ఓటిటి రిలీజ్‌కు సంబంధించిన అధికారిక ప్రకటన ఇచ్చే అవకాశం ఉంది. థియేటర్లో మిస్ అయినవారు, మళ్లీ చూడాలనుకునేవారికి ఇది మంచి వార్తే.