చేతికి ఐదు వేళ్లు ఉన్నా అన్నీ ఒకేలా ఉండవు, ఇంట్లో తోబుట్టువుగా ఉన్నా ఒక్కోక్కరి జీవితం ఒక్కో విధంగా ఉంటుంది. తాజాగా జరిగిన ఈ ఘటన వింటే షాక్ అవ్వాల్సిందే.
ముఖుల్ రాయ్ కి ఇద్దరు కూతుర్లు పెద్ద కుమార్తె చదువుల్లో ఫస్ట్ ఆమె పీజీ చేసింది చివరకు ఆమెకి ఓ మంచి వరుడిని బాగా చదువుకున్న వ్యక్తిని గవర్నమెంట్ టీచర్ గా పనిచేస్తున్న వ్యక్తిని ఇచ్చి పెళ్లి చేశారు.
ఇక పెద్దమ్మాయి కౌసల్య జీవితం చాలా బాగుంది భర్త కూడా చాలా మంచివాడు అయితే పిల్లలు మాత్రం ఐదు సంవత్సరాలు అయినా కలగలేదు.
ఇదే సమయంలో చెల్లెలు సోని చదువు పెద్దగా రాలేదు, పైగా ఇంటర్ నుంచి ప్రేమ వ్యవహారంలో ఉంది. చివరకు లోడ్ తిప్పే ఓ యువకుడితో ప్రేమలో పడింది.
తల్లితండ్రులకి చెప్పకుండా పారిపోయి పెళ్లి చేసుకుంది, డాబాలో ఉండే సోని చివరకు పెంకిటింట్లోకి వెళ్లింది. తన భర్త డ్రైవింగ్ చేసి తెచ్చే డబ్బులు సరిపోవడం లేదు, 2 ఏళ్ల తర్వాత ఇద్దరి మధ్య డబ్బుల విషయంలో గొడవలు మొదలు అయ్యాయి.
ఇష్టం లేని పెళ్లి చేసుకుంది అని తల్లిదండ్రులు ఆమెని పక్కన పెట్టేశారు..
అయితే తల్లిదండ్రులతో కాకుండా అక్కతో ఫోన్లో మాట్లాడేది సోని, అక్క మాత్రం చాలా లగ్జరీగా బతుకుతోంది.
నేను అక్కకంటే అందంగా ఉంటాను చివరకు నా జీవితం ఇలా మారింది అని రోజు బాధపడేది.
ఈ సమయంలో భర్తతో విడాకులకి అప్లై చేసింది. సోని భర్త కూడా ఆమెతో వేగలేక కోర్టులో విడాకులకి సరే అన్నాడు.
చివరకు భర్త నుంచి బయటకు వచ్చి ఒక సూపర్ బజార్ లో వర్క్ చేస్తోంది. ఈ సమయంలో అక్క పై ఒక స్కెచ్ వేసింది. ఒకరోజు తన అక్క భర్తకి ఫోన్ చేసి మీరంటే నాకు ఇష్టం మా అక్కని అడ్డు తొలగించుకుంటే నేను మీ దానిని అవుతాను అని ప్రపోజల్ పెట్టింది . మా అక్కకి పిల్లలు పుట్టరు నాతో మీరు సంతానం కనవచ్చు అని చెప్పింది
మరదలు కన్నింగ్ బుద్ది గురించి భార్యకి అత్తమామలకి నిజం చెప్పేశాడు ఆమె బావ.. చెల్లి గురించి ఆమె మనస్దత్వం గురించి తెలుసుకున్న ఆమె అక్క చెల్లిపై పోలీసులకి ఫిర్యాదు చేసింది. తనపై హత్యాయత్నం కోసం చెల్లి ఏమైనా ప్రయత్నాలు చేయవచ్చు అని ఫిర్యాదు చేసింది.
మదురైలో ఈ ఘటన అందరిని షాక్ కి గురిచేసింది.