అల్లు అర్జున్ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ తల్లి అల్లు కనకరత్నం కన్నుమూశారు. కొద్ది రోజులుగా ఆమె అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు, అలాగే వయోభారంతో ఇబ్బంది పడుతున్నారు.
ఆమె వయసు 94 సంవత్సరాలు, ప్రస్తుతం ప్రముఖ హస్పిటల్స్ లో ఆమెకి ట్రీట్మెంట్ అందించారు. ఈ విషాద వార్త తెలియడంతో మెగా అల్లు కుటుంబ సభ్యులు హైదరాబాద్ వస్తున్నారు. అల్లు అరవింద్ నివాసానికి ఇప్పటికే చాలా మంది ప్రముఖులు వస్తున్నారు.
ఇక ప్రముఖ దర్శకుడు అట్లీతో అల్లు అర్జున్ సినిమా చేస్తున్నారు ఇటీవలే ఈ సినిమా షెడ్యూల్ ముంబైలో స్టార్ట్ అయింది, ప్రస్తుతం తన నానమ్మ మరణ వార్త తెలియడంతో బన్నీ హైదరాబాద్ ప్రత్యేక విమానంలో బయలుదేరారు, ఇక మరోపక్క మెగాస్టార్ కుటుంబ సభ్యులు అందరూ కూడా అల్లు అరవింద్ నివాసానికి వస్తున్నారు, ఇక చెన్నై నుంచి మెగాస్టార్ కుమార్తె సుస్మిత కూడా హైదరాబాద్ చేరుకుంటున్నారు, ఇక శ్రీజ కూడా ఇప్పటికే చేరుకున్నారు. ఇక అల్లు అరవింద్ కుమారులు బాబీ శిరీష్ కూడా ఇక్కడే ఉన్నారు.
ఇక మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పెద్ది సినిమా షూటింగ్ కోసం మైసూర్ లో ఉన్నారు. ఈ వార్త తెలియడంతో అమ్మమ్మని కడసారి చూసేందుకు ఆయన కూడా హైదరాబాద్ బయలుదేరారు.
అల్లు కుటుంబ సభ్యులు అందరూ కూడా ఆమె మరణాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. సినిమా ప్రముఖులు పెద్ద ఎత్తున అల్లు అరవింద్ నివాసానికి వస్తున్నారు. కడసారి ఆమెకి నివాళి అర్పిస్తున్నారు, సెల్రెటీల తాకిడి ఎక్కువ ఉండటంతో పదుల సంఖ్యలో పోలీసులు బందోబస్తు ఏర్పాట్లు చేశారు .. ఈ రోజు తెల్లవారు జామున ఆమె కన్నుమూశారు అని కుటుంబ సభ్యులు తెలిపారు.
ఈ ఏడాది మార్చినెలలో ఆమెకి ఆరోగ్యం సీరియస్ అయింది. వెంటనే ఆస్పత్రిలో చేర్పించి కొద్ది రోజులు ట్రీట్మెంట్ అందించారు, కనకరత్నం గారు వెంటిలేటర్ పై ఉన్నారు.
అయితే ఆమె కోలుకోవడంతో తిరిగి ఇంటికి చేరుకున్నారు. అయితే ఇటీవల మళ్లీ కాస్త నలతగా ఉండంతో ఆమెకి ట్రీట్మెంట్ అందించారు.. కాని విషాదం తెల్లవారుజామున ఆమె ఈ లోకం విడిచారు . మధ్యాహ్నం కోకాపేటలో అంత్యక్రియలు జరుగుతాయని కుటుంబ సభ్యులు, బంధువులు వెల్లడించారు.
కొడుకు అల్లు అరవింద్, అల్లుడు మెగాస్టార్ చిరంజీవి దగ్గరుండి అంతిమ సంస్కారాలకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ వార్త తెలుసుకున్న పలువురు సినీ ఇండస్ట్రీలోని పెద్దలు అల్లు అరవింద్ ఇంటికి వెళ్లి..
ఆమె మృతదేహానికి నివాళులర్పించి వారి కుటుంబాన్ని పరామర్శిస్తున్నారు. అల్లు రామలింగయ్య, కనకరత్నం దంపతులకు నలుగురు సంతానం వారిలో కుమారుడు అల్లు అరవింద్, కుమార్తె సురేఖ మరో ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.. రామలింగయ్య 2004లో మరణించిన తర్వాత ఆమె పెద్దగా బయటకనపడలేదు.
అల్లు రామలింగయ్య శత జయంతి ఉత్సవాల్లో మాత్రమే ఆమె కనిపించారు… ఆమె ఆరోగ్యం పట్ట అల్లు అరవింద్
ఎంతో శ్రద్ద తీసుకున్నారు.. భర్త శతజయంతి ఉత్సవాల్లో పాల్గొంటాను అని చెప్పడంతో కుటుంబ సభ్యులు అందరూ కూడా ఆనందించారు.
ఆ కార్యక్రమానికి దగ్గరుండి అల్లు అరవింద్ తీసుకువచ్చారు.
ఇక తమ అభిమాన హీరో ఇంట ఇలాంటి విషాదం జరగడంతో అభిమానులు కూడా బాధలో ఉన్నారు, మెగా అల్లు ఫ్యాన్స్ ఆమెకి సోషల్ మీడియా వేదికగా నివాళి అర్పిస్తున్నారు.