
పశ్చిమ బెంగాల్‌కు చెందిన 25 ఏళ్ల యువకుడు, తన మాజీ Girl friend పై ప్రతీకారం తీర్చు కోవాడానికి, అమెజాన్ మరియు ఫ్లిప్‌కార్ట్‌ల ద్వారా దాదాపు 300 (COD) పార్సిళ్లను ఆమె నివాసానికి పంపాడు.
బ్రేకప్ తర్వాత ‘ప్రతీకారం’ తీసుకోవాలని భావించిన ఆ వ్యక్తి, తన మాజీ ప్రేయసికి ఆన్‌లైన్ షాపింగ్ పట్ల చాలా ఆసక్తి దిన్నె ఆమెకు వ్యతిరేకంగా ఉపయోగించుకోవాలని నిర్ణయించుకొని,
నాలుగు నెలల పాటు ఆమె నివాసానికి దాదాపు 300 COD పార్సిళ్లను పంపాడు.
25 ఏళ్ల ఈ వ్యక్తిని సుమన్ సిక్‌దార్‌గా గుర్తించారు. సికందర్ ప్రేయసి కోల్కతా లో లేక్‌టౌన్ ప్రాంతంలో నివసిస్తుంది మరియు బ్యాంక్ ఎగ్జిక్యూటివ్‌గా పని చేస్తున్ది.
సికందర్ తన మాజీ ప్రేయసిని వేధించాడన్న ఆరోపణలపై కోల్కతా పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు.
2024 నవంబర్‌లో వీరి ఇద్దరు విడిపోయిన కొద్ది రోజుల తర్వాత పార్సిల్ డెలివరీలు రావడం మొదలయ్యాయి.
పలు ఖరీదైన గ్యాడ్జెట్లు, దుస్తులు తరుచూ పంపిస్తుండే వాడు దీనికి ఆమె తీవ్ర వత్తిడికి మరియు మనోవేదనను అనుభవించాల్సి వచ్చింది.
ఈ వ్యవహారంపై ప్రధాన ఈ-కామర్స్ సంస్థలు అయిన అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లు ఆమె అడ్రెస్ కూడా బ్లాక్ చేశాయి.
ఆమె 2025 మార్చిలో పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
ఆన్‌లైన్ ఆర్డర్లను ట్రేస్ చేయగా, అవి నాదియా జిల్లాకు చెందిన సిక్‌దార్ వద్ద నుంచి జరిగాయని తేలింది. దీంతో అతన్ని అదుపులోకి తీసుకొని, అనంతరం అరెస్ట్ చేశారు.
అతన్ని యెందుకు చేశావ్ ఇలా అని అడ్గ , సిక్‌దార్ నన్ను ప్రేమించి మోసామ్ చేసిందని దానికి ప్రతీకారంగా ఈ plan అమలు చేసినట్లు ఒప్పుకున్నాడు.
పోలీసుల ప్రకారం, తన మాజీ ప్రేయసికి ఆన్‌లైన్ షాపింగ్‌పై బలమైన ఆశక్తి ఉండేదని, అలాగే ఆమె తరచూ నన్నుడబ్బులు చెల్లించమని అడిగేది అని సిక్‌దార్ పోలీసులకు చెప్పారు.
ఆమె కోరికలను నేను తీర్చలేఖ పోవడం వల్లే మా బ్రేకప్ జరిగిందని అతను చెప్పాడు. అందువల్లనే ఈ విధంగా ప్రతీకారం తీర్చుకోవాలని అనుకున్నాను అని చెప్పాడు.