మన బుల్లితెరలో సీరియల్స్ ఎంటర్టైన్ మెంట్ షోలు ఎంత ప్రత్యేకమో అందరికి తెలిసిందే. మంచి టీఆర్పీ ఉంటుంది. జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ, ఢీ ఇలా అనేక షోలు మంచి రేటింగ్ తో ప్రేక్షకుల ఆదరణతో ముందుకు వెళుతున్నాయి. అయితే యాంకర్లకు కూడా అనేక అవకాశాలు వస్తున్నాయి. తెలుగులో సుమ, రష్మీ, అనసూయ, శ్రీముఖి ఈ బుల్లితెర షోలతో ఎంతో ఆకట్టుకున్నారు. ఇక కన్నడ సీరియల్ నటి తెలుగులో యాంకర్ గా ఎంట్రీ ఇచ్చి తన అందం అభినయం మాటలతో మరింత పాపులర్ అయింది.
ఆమె ఎవరో కాదు యాంకర్ సౌమ్యరావు. కన్నడ నుంచి వచ్చిన ఈ భామ తెలుగులో కూడా సీరియల్స్ చేసింది తర్వాత జబర్దస్త్ షోలో యాంకర్ గా మెప్పించింది. తెలుగులో పలు షోలతో ఆకట్టుకుంటోంది సౌమ్య. తాజాగా ఓ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో సౌమ్య తన జీవితంలో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంది అనే విషయాన్ని తెలియచేసింది.
తన కుటుంబం గురించి వారు ఎన్ని ఇబ్బందులు పడ్డారు అనే విషయాలు ఈ ఇంటర్య్వూలో పంచుకుంది..
మా నాన్న ఊరంతా అప్పులు చేసారు. మమ్మల్ని పట్టించుకోలేదు. ఆయన గురించి పట్టించుకోకపోవడమే మంచిది. మానాన్న అప్పులు చేయడంతో అందరూ మా ఇంటికి వచ్చి డబ్బులు అడిగేవారు, మా అమ్మని డబ్బులు ఇవ్వమని గోల చేసేవారు. నీ కూతురు పెద్దమనిషి అయిందా అని నీచంగా మాట్లాడేవారు.
నేను అప్పుడు స్కూల్ లో చదువుకుంటున్నాను.. మా అమ్మ ఆ టార్చర్ అనుభవించింది. నేను రోజు ఏడిచేదాన్ని. చివరకు నన్ను నా బ్రదర్ ని తీసుకుని తిరుపతి వచ్చేసింది అమ్మ. నైట్ బస్ స్టాండ్ లో పడుకున్నాం. రెండు రోజులు అన్నం తినలేదు. తిరుపతి వెళ్ళాక ఎప్పుడు ఫుడ్ పెడతారు అని ఎదురు చూసేదాన్ని. చాలా ఇబ్బందులు పడ్డాం. మేము తినడానికి లేని రోజుల నుంచి వచ్చాము. మానాన్న పట్టించుకునేవ్యక్తి కాదు.
నేను కాలేజీ చదువుకునే సమయంలో ఓ లాయర్ దగ్గర టైపిస్ట్ గా పనిచేశాను. నా దగ్గరకు వచ్చి నా పై చేతులు వేసేవాడు. వాళ్ల భార్య తల్లి లేనప్పుడు నా దగ్గరకు వచ్చి ఇలా బిహేవ్ చేసేవాడు, చివరకు అతని దగ్గర పనిమానేశాను. మన పరిస్దితి తెలిసి ఇలాంటి వారు ఇంకా అలుసుగా చూస్తారు అని ఆమె బాధపడింది.
మా ఇంటికి బంధువులు వస్తే పక్కింటి నుంచి పంచదార టీ పౌడర్ అప్పుగా తెచ్చేవాళ్లం. ఒక్కోసారి పక్కింటి వాల్లు మా ముందు తలుపు కూడా వేసేవారు. ఒక్కోసారి లేవు అని చెప్పేవారు. చాలా పేదరికం నుంచి వచ్చాము. నేను ఎప్పుడూ సెలబ్రెటీగా ఫీల్ అవ్వను, ఒక్కోసారి ఆటోలో కూడా వెళుతూ ఉంటాను.
నేను కాలేజీ చదువు కూడా పార్ట్ టైమ్ జాబ్ చేసి చదువుకున్నాను అని ఆమె తెలియచేసింది
మా అమ్మకు బ్రెయిన్ క్యాన్సర్ అటాక్ అయింది. లోపల సెల్స్ చాలా డ్యామేజ్ అయ్యాయని తన తల్లి గురించి చెబుతూ ఆమె ఎమోషనల్ అయింది.యాంకర్ సౌమ్య మాటలు విని ఆమె అభిమానులు నవ్వుతూ షో చేస్తున్నా మీ మీ జీవితంలో ఇంత బాధ ఉందా అని కామెంట్లు పెడుతున్నారు. మీకు ఆ దేవుడి ఆశీస్సులు ఉంటాయి అని దైర్యం చెబుతున్నారు.