ఒక 15 నుంచి 20 ఏళ్లు వెనక్కి వెళితే బుల్లితెరలో ఎలాంటి ప్రోగ్రామ్ వచ్చినా సూపర్ హిట్ అయ్యేది. చెప్పాలి అంటే అప్పటి యాంకర్లు ఇప్పుడు చాలా మంది తెరమరుగు అయ్యారు.
కొందరు మాత్రం అప్పుడప్పుడు కనిపిస్తున్నారు. ఇంకొందరు సీరియల్స్ లో సెటిల్ అయ్యారు. అప్పట్లో యాంకర్ ఉదయభాను తెలుగులో స్టార్ యాంకర్ గా పెద్ద పొజిషన్ కు వెళ్లారు.
సినిమా ఈవెంట్లు, సీరియల్స్, బుల్లితెర షోలు ఇలా ఏ ఈవెంట్ ఉన్నా యాంకర్ ఉదయభాను ఉండాల్సిందే అంత పేరు సంపాదించుకుంది ఆమె.
అయితే తర్వాత ఆమెకి వరుసగా అవకాశాలు తగ్గుముఖం పట్టాయి. ఇక వివాహం చేసుకుని ఆ తర్వాత తన సమయం అంతా పిల్లలకు కుటుంబానికి కేటాయించారు.
అడపాదడపా ఈవెంట్లు మాత్రమే ఇటీవల చేస్తున్నారు. తెలుగులో కామెడీ పంచ్ టైమింగ్ తో అందరిని జోష్ లో నింపడంతో ఉదయభాను ఎంతో పేరు పొందారు.
తాజాగా ఓ ప్రమోషన్ ఈవెంట్, మరో ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఆమె మాట్లాడుతూ ఇండస్ట్రీలో యాంకర్ లకు ఎలాంటి సమస్యలు ఉంటున్నాయో గళమెత్తారు.
ఇటీవల ఇండస్ట్రీలోని కొన్ని గ్రూపులు యాంకరింగ్ ను సిండికేట్ గా మార్చేశాయని ఆరోపించారు ఉదయభాను. అయితే ఆమె ఈ వ్యాఖ్యలు చేయడం పై కొందరు సినిమా పెద్దలు కూడా షాక్ అయ్యారు.
ముఖ్యంగా ఈ రోజుల్లో సినిమా రిలీజ్ కు ముందు టీజర్ ఈవెంట్లు,ట్రైలర్ ఈవెంట్ ,ప్రీ రిలీజ్ ఈవెంట్, సినిమా హిట్ అయిన తర్వాత సక్సస్ మీట్ ఈవెంట్ ఇలా ప్రతీ సినిమాకి నాలుగు ఐదు ఈవెంట్లు జరుగుతున్నాయి. కాని ఒకరు ఇద్దరు యాంకర్లు మినహా మిగిలిన ఎవరికి పెద్దగా అవకాశాలు రావడం లేదు.
ఉదయభాను మాట్లాడుతూ ఈ రంగంలో తనకు ఎదురైన అనుభవాలే తనను అలా మాట్లాడేలా చేశాయన్నారు.
చాలా సార్లు ఈవెంట్లు ఒకే అయ్యాయి అక్కడకు వెళ్లిన తర్వాత వేరే యాంకర్ ని తీసుకున్నాము అని చెప్పేవారు. ఇలా వెనుదిరిగి చాలా సార్లు వచ్చేశాను.
కొన్ని ఛానల్స్ తన డేట్స్ తీసుకుని ఆ తర్వాత తనకు సమాచారం కూడా ఇవ్వకుండానే ప్రాజెక్ట్ నుంచి తీసేశారు అని ఆవేదన వ్యక్తం చేశారు. కొందరు తను ఎక్కువ రెమ్యునరేషన్ అడుగుతున్నా అని ముద్రకూడా వేసి దూరం చేశారు.
ఇదంతా పెద్ద గ్రూప్ లుగా ఏర్పడి చేస్తున్నారు అని బాధఫడ్డారు ఆమె.. ఇక చేసిన ప్రోగ్రామ్స్ కి సంబంధించి చెక్కులు చాలా బౌన్స్ అయ్యాయి అని ఆమె తెలిపారు .
త్వరలోనే అన్ని విషయాలను బహిర్గతం చేస్తానని… ఆ రోజు వచ్చినప్పుడు పెద్ద యుద్ధాలే జరుగుతాయని సంచలన వ్యాఖ్యలు చేశారు ఉదయభాను.
తాను ఒకవేళ చిన్న ఇంటర్వ్యూలు చేస్తే. చిన్న చిన్న యాంకర్లు అలాగే ఇప్పుడు కెరియర్ మొదలుపెట్టేవారు ఇబ్బంది పడతారు. వారికి అవకాశాలు రావు అందుకే చేయడంలేదన్నారు. మరి ఉదయభాను ఎలాంటి విషయాలు బయటకు రివిల్ చేస్తారో చూడాలి.