హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ టాలీవుడ్ లో మంచి క్రేజ్ ఉన్న హీరోయిన్, లేడి ఓరియెంటెడ్ చిత్రాలకు కూడా ఆమె బాగానప్పుతుంది అనే పేరు తెచ్చుకుంది. కుర్రాళ్లకు ఫేవరెట్ హీరోయిన్ అనే చెప్పాలి. ప్రస్తుతం ఆమె చాలా సెలక్టెట్ గా సినిమాలు చేస్తున్నారు.
తాజాగా ఆమె నటించిన లేడి ఓరియెంటెడ్ సినిమా పరదా. ఈ సినిమా ప్రిమియర్స్ చూసిన చాలా మంది ఈ సినిమా గురించి చెబుతున్నారు, మరి ఈ సినిమా ఏ విధంగా ఉంది అనేది ఓసారి రివ్యూలో చూద్దాం.
పడతి అనే ఊరు అక్కడ వయసుకి వచ్చిన ఆడపిల్లలు ఎవరైనా బయటకు వెళితే పరదా కప్పుకుని తిరగాల్సిందే. అయితే ఆ ఊరిలో ఎవరైనా పొరపాటున పరదా తీస్తే కచ్చితంగా అక్కడ గ్రామదేవత జ్వాలమ్మకు ఆత్మాహుతి చేసుకోవాలి.
అయితే ఊరిలో సుబ్బు అనుపమ, రాజేశ్ ఇద్దరు ప్రేమలో పడతారు. ఇద్దరికి పెళ్లి చేయాలని పెద్దలు నిర్ణయం తీసుకుంటారు. అయితే ఎంగేజ్ మెంట్ రోజు సుబ్బు ఫోటో కారణంగా ఆత్మాహుతి చేసుకోవాలి అని గ్రామపెద్దలు కండిషన్ పెడతారు. ఇందులో తన తప్పులేదు అని చెప్పినా వినరు.
అయితే అక్కడ నుంచి ఆమె ఊరు దాటి హిమాచల్ ప్రదేశ్‌లోని ధర్మశాల వెళుతుంది. అక్కడకు వెళ్లేందుకు ఆమెకి ఎవరు సహాయం చేశారు, ఆమె పరిస్దితి ఏమిటి ? అసలు ఆమె చివరకు గ్రామానికి వచ్చిందా, వారిద్దరు కలిశారా అనేది పరదా స్టోరీ.
ఇటీవల కొన్ని హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీస్ వస్తున్నాయి. చెప్పాలంటే గతంలో ఓన్లీ హీరో బేస్ స్టోరీలతో వెండితెరమీద అద్బుతాలు జరిగాయి. ఇప్పుడు హరోయిన్ స్టోరీలతో బాక్సాఫీస్ దగ్గర కొన్ని మిరాకిల్స్ జరుగుతున్నాయి.
ముఖ్యంగా ఇలాంటి స్టోరీలు దర్శకుడు రాసుకున్నా ఆ స్టోరీకి సరైన నటన కనబరిచే అమ్మాయి కాల్సిందే. ఈ సినిమా అనుపమ 100 కి 100 శాతం న్యాయం చేసింది . ఈ సినిమాలో హీరోయిన్ అనుపమ అయినా మొయిన్ మాత్రం కధ ప్రధాన పాత్ర అని చెప్పుకోవాలి.
ఇంత టెక్నాలజీ యుగంలో కూడా ఇంకా కొన్ని ప్రాంతాల్లో ఈ మూడనమ్మకాలు జాడ్యాలు చాలా ఉన్నాయి. వాటిని పూర్తిగా తొలగించే స్టోరీ సినిమాలు రావాల్సిందే. మహిళలు ఎంతో దైర్యంగా ఉద్యోగాలు చేస్తున్నారు. విశ్వాన్ని జయిస్తున్నారు. కావున అలాంటి మహిళలని మూడనమ్మకాలు ఆచారాలతో గడపదాటనివ్వని వాళ్లు కొందరు ఉన్నారు.
వారికి కనువిప్పు కలిగించే కల్పిత కధ పరదా అనే సినిమా.
ఒక్క విషంగా చెప్పాలంటే మూఢనమ్మకాలపై ఎలా పోరాడింది అనే కల్పిత కథతో తీసిన చిత్రం ఇది.
సినిమాలో కాసేపు మాత్రమే రాజేంద్ర ప్రసాద్ కనిపించినా, ఆయన కనిపించినంత సేపు అద్బుతమైన డైలాగ్స్ చెప్పారు.. ముఖ్యంగా అమ్మాయిలు కచ్చితంగా చూడాల్సిన సినిమా ఇది.