స్టార్ హీరోయిన్ అనుష్క 20 ఏళ్లుగా టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎనలేని క్రేజ్ సంపాదించుకుంది.. సూపర్ సినిమాతో ఆమె ఇండస్ట్రీకి పరిచయం అయింది. ముద్దుగా ఆమెని స్వీటి అని పిలుస్తారు అభిమానులు. అనుష్క కెరీర్ లో బిగెస్ట్ హిట్ గా నిలిచిన సినిమా బాహుబలి అని చెప్పాలి. ఈ సినిమాలో ప్రభాస్ సరసన ఆమె నటించింది. దేవసేనగా అందరి హృదయాలకు దగ్గర అయింది, రమ్యకృష్ణ, సత్యరాజ్, రానా, ప్రభాస్, అనుష్క ఈ సినిమాలో కీలక పాత్రలు పోషించారు, రెండు పార్టులుగా వచ్చింది ఈ సినిమా.
మన తెలుగు సినిమా పాన్ ఇండియా రేంజ్ కు వెళ్లడానికి ఈ సినిమానే ప్రధాన కారణం అని చెప్పాలి.
అనుష్క ఈ సినిమాలో మొదటి పార్ట్ లో బానిసగా.. సెకండ్ పార్ట్ లో యువరాణి గా నటించి అలరించింది.ఈ సినిమాలో అనుష్క పాత్రకు డూప్ గా ఓ నటి నటించారు. అయితే ఆమె గురించి చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. మరి ఆమె ఎవరు అనేది ఓసారి తెలుసుకుందాం.
సేమ్ ఈ మెని చూస్తే అనుష్కని చూసినట్లు అనిపిస్తుంది, అంతే హైట్ కలర్ అలాంటి పర్సనాలిటీతో కనిపిస్తారు.
ఆమె పేరు రుషిక రాజ్ 2021 లో వచ్చిన అశ్మీ అనే సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇచ్చారు, అయితే ఆమెకి పెద్దగా తెలుగులో అవకాశాలు రాలేదు కాని కన్నడలో అవకాశాలు వస్తున్నాయి అక్కడ ఆమె వరుస సినిమాలు చేస్తున్నారు.
రుషిక రాజ్అనుష్కకు డూప్ గానే కాదు బ్యా గ్రౌండ్ ఆర్టిస్ట్ గానూ కనిపించింది. ఇక తన అప్ డేట్స్ ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో పంచుకుంటుంది. ఇక సేమ్ అనుష్కలా ఆమె కనిపిస్తుంది అంటున్నారు చూసిన వారు. ప్రస్తుతం అనుష్క ఘాటీ అనే సినిమాలో నటిస్తుంది. క్రిష్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు.
సెప్టెంబర్ 5వ తేదీన రిలీజ్ కానుంది ఈ సినిమా.
https://www.instagram.com/rushikaraj_official