ప్రియాంకా గాంధీ కుమారుడు రేయ్హాన్ వాద్రాతో ఎంగేజ్‌మెంట్ వార్తలతో అవివా బెగ్ పేరు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది. ఢిల్లీకి చెందిన అవివా ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్‌గా తనకంటూ మంచి గుర్తింపు సంపాదించింది. జర్నలిజం చదివిన ఆమె “ఆర్టిలియర్ 11” అనే ఫోటోగ్రఫీ స్టూడియోను నడుపుతోంది. సామాన్య ప్రజల రోజువారీ జీవన విధానాన్ని, భావోద్వేగాలను తన కెమెరాలో బంధించడం ఆమె ప్రత్యేకత.
పలు ఆర్ట్ గ్యాలరీల్లో ఆమె తీసిన ఫోటోలు ప్రదర్శించబడ్డాయి. అలాగే వెడ్డింగ్ ఫోటోగ్రఫీ, ఫ్యాషన్ షూట్లు, పాపులర్ మ్యాగజైన్ల కోసం కూడా అవివా పనిచేసింది.
సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో కూడా ఆమెకు మంచి ఫాలోయింగ్ ఉంది. ప్రస్తుతం ఎంగేజ్‌మెంట్ వార్తల కారణంగా ఆమెపై ఆసక్తి మరింత పెరిగింది. అధికారిక ప్రకటన ఇంకా వెలువడకపోయినా, ఈ జంటపై నెటిజన్లలో చర్చలు జోరుగా జరుగుతున్నాయి.