టాలీవుడ్ ప్రముఖ కమెడియన్ ప్రవీణ్ మంచి మంచి సినిమాలతో అలరిస్తున్నారు. మెయిన్ హీరోల నుంచి టైర్ 2 హీరోలు అప్ కమింగ్ హీరోల సినిమాల్లో కూడా ప్రవీణ్ కి మంచి పాత్రలు వస్తున్నాయి. గోదావరి యాస కూడా ఇట్టే పలికిస్తాడు . కమెడియన్ ప్రవీణ్ లీడ్ రోల్‌లో నటించిన చిత్రం బకాసుర రెస్టారెంట్. వినడానికి కాస్త వెరైటీగా ఉన్నా కంటెంట్ ని నమ్మి ఈ సినిమా తీశారు అనిపిస్తుంది.
హర్రర్ కామెడీ జానర్ లో రూపొందిన ఈ చిత్రం ఆగస్ట్ నెలలోనే దియేటర్లలో రిలీజ్ అయింది. అయితే ఈ సినిమాకి ఎస్.జే. శివ దర్శకత్వం వహించారు.. కమెడియన్ ప్రవీణ్ ,వైవా హర్ష శ్రీకాంత్ అయ్యంగార్ , కృష్ణ భగవాన్, కీలక రోల్స్ చేశారు. అయితే పూర్తిగా దియేటర్ రన్ క్లోజ్ చేసుకున్న ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలో సైలెంట్ గా స్ట్రీమింగ్ అవ్వనుంది, ఇప్పటికే అనౌన్స్ మెంట్ వచ్చేసింది.
మరి ఈ స్టోరీ చూస్తే
పరమేశ్వర్ నటుడు ప్రవీణ్ ఓ టెకీ. నలుగురు ఫ్రెండ్స్ తో ఒకే రూమ్ షేర్ చేసుకుంటారు. అయితే ఈ జాబ్ చేయడం పరమేశ్వర్ కి ఇష్టం ఉండదు. కాని డబ్బుల కోసం చేస్తూ ఉంటాడు. తన కోరిక ఒకటే,ఎప్పటికైనా మంచి ఫుడ్ రెస్టారెంట్ స్టార్ట్ చేయాలి అని కోరిక. ఓసారి పిచ్చాపాటిగా అందరు స్నేహితులు ఉన్నప్పుడు ఇలా తన కోరిక చెబుతాడు. కానీ పెట్టుబడికి ఎవరి దగ్గర డబ్బులు ఉండవు. ఈ సమయంలో ఓ ఐడియా వస్తుంది.
డబ్బుల కోసం యూట్యూబ్ లో ఘోస్ట్ వీడియోలు చేద్దామని సలహా ఇస్తారు. ఇలా వీడియోలు చేస్తే వీరి అదృష్టం పండి. తొలి వీడియో బాగా వైరల్ అవుతుంది. తర్వాత వీడియో కోసం ఓ వ్యక్తి ఇంటికి వెళితే, అక్కడ తాంత్రిక శక్తి మంత్రం కలిగిన పుస్తకం దొరుకుతుంది. ఇక ఆ పుస్తకం ప్రకారం డబ్బు సంపాదించాలని అనుకుంటారు. అయితే ఒక నిమ్మకాయకి పూజ చేస్తే అందులో నుంచి ఆత్మ వస్తుంది.
ఈ సమయంలో ఆ ఆత్మ వీరిని విడిచిపెట్టదు. చివరకు స్నేహితుడు అంజిబాబు శరీరంలోకి వెళుతుంది. చివరకు ఈ స్నేహితులు అందరూ ఆ ఆత్మని ఎలా బయటకు పంపారు. దాని కోసం వీరు ఏం చేశారు, అసలు ఈ ఆత్మ ఎవరిది, ఎందుకు అంజిబాబుని ఎంచుకుంది, వారి గతం ఏమిటి, చివరకు రెస్టారెంట్ కోరిక నెరవేరిందా ఇవన్నీ చూడాలంటే సినిమా వాచ్ చేయాల్సిందే.
ఇలాంటి డిఫరెంట్ సినిమాలు ఇప్పుడు ప్రేక్షకులు కోరుకుంటున్నారు. రొటీన్ లవ్ స్టోరీలు కామెడీ కాకుండా. ఈ హర్రర్ జానర్ తో కామెడీ అందించే కథలకి ఇప్పుడు మార్కెట్లో అభిమానులు ఉన్నారు. తాజాగా ఈ స్టోరీ కూడా ఇలాంటిదే. ముఖ్యంగా దర్శకుడు ఈ సినిమా పై చాలా ఫోకస్ పెట్టారు. దర్శకుడు ఎంచుకున్న కథ ఆకర్షణీయమైంది. సినిమా ముందు అంతా సాధారణంగా జరిగినా, ఎప్పుడైతే ఆత్మ స్నేహితుడి శరీరంలోకి వెళుతుందో అక్కడ నుంచి అసలు సినిమా మొదలైంది. అక్కడ నుంచి సినిమా కామెడీ అందుకుంది. అతని ఫ్లాష్ బ్యాక్ కి ఓ ఎమోషనల్ టచ్ ఇవ్వడం కూడా బాగుంది. వైవా హర్ష పాత్ర ఫుల్ నవ్వు తెప్పిస్తుంది.
ఇక ఈ సినిమా మీరు సోమవారం నుంచి అమెజాన్ లో చూడవచ్చు
ఇక సెప్టెంబర్ 12 నుంచి సన్ నెక్ట్స్ లో కూడా సేమ్ స్ట్రీమింగ్ అవుతుంది
ధియేటర్లో ఈ సినిమా మిస్ అయ్యాము అనుకుంటే కచ్చితంగా ఈ ఓటీటీల్లో మిస్ కాకండి.