Saturday, January 31, 2026
HomeNewsCinemaబాలయ్యకు వరల్డ్ రికార్డు గౌరవం

బాలయ్యకు వరల్డ్ రికార్డు గౌరవం

Published on

ప్రముఖ టాలీవుడ్ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అంటే అంద‌రికి అభిమాన‌మే, చిన్న‌వ‌య‌సులోనే న‌టుడిగా సినిమా ప‌రిశ్ర‌మ‌లోకి ఎంట్రీ ఇచ్చారు. ఇప్ప‌టి స్టార్ హీరోల్లో ఇండ‌స్ట్రీలో అత్య‌ధిక కాలం వ‌ర్క్ చేసిన సీనియ‌ర్, అనుభ‌వం ఉన్న న‌టుడు అంటే బాల‌య్య అనే చెప్పాలి. దాదాపు నాలుగు త‌రాల ద‌ర్శకుల ద‌గ్గ‌ర వ‌ర్క్ చేసిన న‌టుడు ఆయ‌న‌.

తాజాగా త‌న సినిమా కెరియ‌ర్ లో ఓ మైల్ స్టోన్ చేరుకున్నారు. కథానాయకుడిగా 50 ఏళ్లు పూర్తి చేసుకున్నారు బాల‌య్య‌. దీనికి గుర్తుగా బాల‌య్యకు అంతర్జాతీయ స్థాయిలో అరుదైన గౌరవం లభించింది.లండన్‌కు చెందిన ప్రతిష్ఠాత్మక వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ తమ గోల్డ్ ఎడిషన్‌లో బాలకృష్ణకు స్థానం కల్పించింది. ఇది ఒక అపురూమైన రికార్డ్ అనే చెప్పాలి, ఇండ‌స్ట్రీలో ఎవ‌రికి సాధ్యం కాని అరుదైన ఘ‌న‌త అందుకున్నారు బాల‌య్య. తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ‌లో ఇదే తొలి అని చెబుతున్నారు అంద‌రూ.

ఇక బాల‌య్య బాబుకి ఈ స్దానం ద‌క్క‌డంతో ఆయ‌న అభిమానులు ఎంతో ఆనందాన్ని తెలియ‌చేస్తున్నారు. దేశంలో ఉన్న బాల‌య్య అభిమానుల‌తో పాటు విదేశాల్లో ఉన్న బాల‌య్య అభిమానులు కూడా ఆయనకు అభినందనలు తెలియ‌చేస్తున్నారు. ఇక ఏపీ సీఎం చంద్ర‌బాబు కూడా ఆయ‌న్ని అభినందించారు. ప్రియమైన బాలయ్యకు అభినందనలు. కథానాయకుడిగా 50 ఏళ్ల ఆయన ప్రస్థానం భారత సినీ చరిత్రలో ఒక సువర్ణాధ్యాయం. వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ గుర్తింపు ఆయన అసాధారణ ప్రయాణానికి నిదర్శనం అంటూ ఆయ‌న బావ, ఏపీ సీఎం చంద్ర‌బాబు బాల‌య్యకు ఈ అరుదైన గుర్తింపు రావ‌డం పై త‌న సంతోషాన్ని అభినంద‌న‌ల రూపంలో తెలియ‌చేశారు.

Also Read  Rashmika Mandanna:రక్షిత్ శెట్టి నుంచి విజయ్ దేవరకొండ వరకు.

ప్రియమైన బాల మావయ్యకు శుభాకాంక్షలు. ఆయన వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించడం మా కుటుంబానికే కాక, ప్రతి తెలుగు సినీ అభిమానికి గర్వకారణం. సినిమా పట్ల ఆయనకున్న అభిరుచి, క్రమశిక్షణ మా అందరికీ స్ఫూర్తినిస్తాయి అంటూ నారా లోకేష్ కూడా ఆయ‌న మామ‌య్య‌కు విషెస్ తెలియ‌చేశారు, ఇక సోష‌ల్ మీడియా వేదిక‌గా బాల‌య్య ఫ్యాన్స్ అభినంద‌న‌లు తెలియ‌చేస్తున్నారు.

ఇక ఆయ‌న‌ను కేంద్ర ప్ర‌భుత్వం ప‌ద్మ‌భూష‌ణ్ తో సత్క‌రించిన విష‌యం తెలిసిందే

Latest articles

Tollywood: మరలా టాలీవుడ్‌‌కి తిరిగి వచ్చిన బండ్ల గణేష్..!

టాలీవుడ్‌లో నటుడు మరియు నిర్మాతగా పేరుపొందిన బండ్ల గణేష్ కొంతకాలం సినిమాలకు దూరంగా ఉన్న తర్వాత మళ్లీ ఇండస్ట్రీలోకి...

Yellamma Cinema: అఫీషియల్‌ గ్లీంప్స్ ఏప్పుడంటే..?

బలగం సినిమాతో మంచి పేరు తెచ్చుకున్న దర్శకుడు వేణు యెల్దండి ఇప్పుడు తన రెండో సినిమా “యెల్లమ్మ” ను...

Chinmayi Sripadaకు షాకింగ్ బెదిరింపులు… న్యాయం కోసం పోలీసుల్ని ఆశ్రయించిన గాయని

ప్రముఖ గాయని, డబ్బింగ్ ఆర్టిస్ట్ చిన్మయి శ్రీపాడ తీవ్ర సైబర్ వేధింపుల బారిన పడ్డారు. కొందరు గుర్తు తెలియని...

Nagavamshi: వరుస flops తో దిక్కుతోచలేని స్థితిలో…

ప్రొడ్యూసర్ నాగ వంశీ టాలీవుడ్‌లో తెలియని వ్యక్తి కాదు.కానీ ఏమైందో ఏమో — 2025 సంవత్సరం నాగ వంశీకి...

Rashmika The Girlfriend: నాన్-థియేట్రికల్ రైట్స్ కి భారీ డీల్..

రష్మిక మందన్నా తాజా చిత్రం “ది గర్ల్‌ఫ్రెండ్” ఇంకా థియేటర్లలోకి రాకముందే బిజినెస్‌లో భారీ హడావిడి సృష్టిస్తోంది. సినిమా...

“LEO”కు ప్రీక్వెల్‌గా రాఘవ లారెన్స్ హీరోగావస్తున్న “Benz”..!

రాఘవ లారెన్స్ హీరోగా, నివిన్ పౌలి విలన్‌గా నటిస్తున్న తాజా చిత్రం “Benz” సినీ అభిమానుల్లో భారీ అంచనాలను...

More like this

Viswambhara :జులై 10న చిరంజీవి ‘విశ్వంభర’ రిలీజ్?

మెగాస్టార్ అభిమానులు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న భారీ ఫాంటసీ చిత్రం విశ్వంభర విడుదలపై ఎట్టకేలకు క్లారిటీ వచ్చినట్లు సినీ వర్గాలు...

Shankar Drea Project: నిర్మాత… కానీ కఠిన నిబంధనలతో!

భారతీయ సినీ పరిశ్రమలో విజువల్ గ్రాండియర్‌కు కేరాఫ్ అడ్రెస్‌గా నిలిచిన దర్శకుడు శంకర్ ఎప్పటినుంచో కలగా భావిస్తున్న ప్రాజెక్ట్...

Champion Movie:OTTలోకి వచ్చేసిన ‘ఛాంపియన్’ మూవీ

యువ హీరో రోషన్ ప్రధాన పాత్రలో నటించిన పీరియాడిక్ యాక్షన్ డ్రామా ఛాంపియన్ ఇప్పుడు OTTలోకి వచ్చేసింది. గత...