వారానికి 5 రోజుల వర్కింగ్ డేస్ కోసం దేశవ్యాప్తంగా బ్యాంకింగ్ ఉద్యోగులు ఈ నెల 27న సమ్మె బాట పట్టనున్నారు. 2024 మార్చిలో ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ దీనికి ఒప్పుకున్నా 9 ఉద్యోగ సంఘాలకు ప్రతినిధ్యం వహించే UFBU తెలిపింది.
అయినా ఇప్పటికీ అమలు చేయకపోవడంతో సమ్మెకే దిగుతున్నట్లు చెప్పారు. ఆర్బీఐ, ఎల్‌ఐసీ, జీపీఫ్ వంటి సంస్థల్లో ఇప్పటికే 5 రోజుల పని విధానాన్ని అమలు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
తమకు కూడా అదే విధానం అమలు చేయాలని ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. నిరంతరం కౌంటర్ పనులు, టార్గెట్లు, ప్రెజర్ కారణంగా ఉద్యోగులపై మానసిక భారం పెరుగుతోందని, వర్క్–లైఫ్ బ్యాలెన్స్ పూర్తిగా దెబ్బతింటోందని సంఘాలు చెబుతున్నాయి.
సమస్య పరిష్కారానికి ప్రభుత్వం, బ్యాంక్ మేనేజ్‌మెంట్ వెంటనే స్పందించాలని హెచ్చరిస్తున్నారు. లేదంటే ఆందోళనలను మరింత తీవ్రతరం చేస్తామని UFBU స్పష్టం చేసింది.