తెలుగులో బుల్లితెరలో ప్రసారమయ్యే బిగ్ బాస్ షోకు ఎంత ఆదరణ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇప్పటి వరకూ మొత్తం 8 సీజన్లు పూర్తి అయ్యాయి. త్వరలో 9 సీజన్ స్టార్ట్ కానుంది.
అయితే ప్రతీసారిలా కాకుండా ఈసారి సరికొత్త థీమ్ తో టాస్క్ లతో సీజన్ ఉండబోతోంది. కామన్ మ్యాన్ కేటగిరిలో కొందరిని ఈసారి హౌస్ లోకి తీసుకుంటున్నారు.
ఈసారి సెలబ్రెటీలతో పాటు కామన్ మ్యాన్ కేటగిరి నుంచి కూడా మెజార్టీ సభ్యులు ఇంటిలోకి రానున్నారు. ఇలా ఉంటే అసలైన మజా గేమ్ లో ఉంటుంది అని బిగ్ బాస్ లవర్స్ కూడా భావిస్తున్నారు.
అయితే దాదాపు ఆన్ లైన్ ద్వారా 20 వేల మంది దీని కోసం అప్లై చేసుకున్నారు, ఫైనల్ గా అనేక రౌండ్లు పూర్తి చేసి వడపోతల తర్వాత 200 మందిని ఇంటర్వ్యూ చేసి దాదాపు 40 మందిని ఎంపిక చేశారు.
వీరికి అగ్నిపరీక్ష అనే టాస్క్ పెట్టి అందులో సెలక్ట్ అయిన వారిని నేరుగా ఫైనల్ కంటెస్టెంట్స్ గా నిర్ణయిస్తున్నారు. ఈ అగ్ని పరీక్ష జడ్జిలుగా గత సీజన్లో విన్నర్స్ ని తీసుకున్నారు.
అగ్ని పరీక్ష పేరుతో పోటీలు నిర్వహించి, గెలిచిన వారిని బిగ్ బాస్ హౌస్‌లోకి పంపడం అనేది నిజంగా ఇది ఓ సంచలనం అనే చెప్పాలి.
అంటే గేమ్ కంటే ముందు వీరు ఇక్కడ అగ్నిపరీక్ష దాటి అసలైన గేమ్ లోకి ఎంట్రీ ఇస్తారు.ఇక్కడ అసలు ట్విస్ట్ ఏమిటి అంటే? కామన్ మ్యాన్ కేటగిరిలో కూడా చాలా మంది సెలబ్రెటీలు ఉన్నారు.
అయితే వారు సోషల్ మీడియాలో బాగా ఫేమ్ పొందిన వాళ్లని తెలుస్తుంది. ఇది ఎంత వరకూ వాస్తవం అనేది ఆ రోజు షోలోనే క్లారిటీ వస్తుంది. అయితే ఈ కేటగిరిలో ఎవరు ఉన్నారు అనేది చూస్తే,
అనూష రత్నం
దివ్య నిఖిత
వెజ్ ఫ్రైడ్ మోమో
శ్వేతా శెట్టి
డెమాన్ పవన్
ప్రసన్న కుమార్
దమ్ము శ్రీజ
దాలియా
మర్యాద మనీశ్
మాస్క్ మ్యాన్ హృదయ్
షాకీబ్
శ్రియా
వీళ్లందరిని చూస్తుంటే, సుమారు 50 వేల నుంచి 1 లక్ష వరకూ సోషల్ మీడియాలో ఫాలోవర్లు ఉన్న వారు ఉన్నారు
ఈసారి టాస్కులు కూడా సరికొత్తగా ప్లాన్ చేస్తున్నారు.
సామాన్యులను, సెలబ్రిటీలను కలిపి వేర్వేరుగా రెండు హౌసుల్లో పెట్టి టాస్కులు నిర్వహిస్తారు అనే వార్తలు వినిపిస్తున్నాయి. చూడాలి మొత్తానికి సెప్టెంబర్ ఫస్ట్ వీక్ లో ఈ సారి సీజన్ 9 షురు కానుంది