ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 ప్రారంభమైంది. సెలబ్రెటీలు కామనర్స్ తో ఈసారి సందడిగా మారింది హౌస్ మొత్తం 15 మంది ఇంటి సభ్యులు హౌస్ లోకి ఎంటర్ అయ్యారు. సీనియర్ నటి హీరోయిన్ ఆశా సైనీ కూడా ఎంట్రీ ఇచ్చింది. తెలుగులో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించింది ఈ అందాల భామ. తర్వాత సినిమాలకు దూరమైంది. మరి ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ లో ఎంట్రీ ఇచ్చింది. తనని ఆశ సైని అని కాదు ఫ్లోరా సైని అని పిలవమంది మరి ఆశాసైని రియల్ స్టోరీ ఈరోజు తెలుసుకుందాం
29 September 1978 ఆషా సైని చండీఘర్ లోని ఆర్మీ అధికారి కుటుంబంలో జన్మించింది. ఆమె పేరు ఫ్లోరా సైని తర్వాత ఆశ సైనిగా ఇండస్ట్రీ ఆమె పేరుని మార్చింది. జమ్మూ కశ్మీర్ లోని ఉదంపూర్ లోనూ, ఢిల్లీలోని ఆర్మీ పబ్లిక్ స్కూల్లో చదివింది. తల్లి టీచర్ గా పనిచేసేవారు.తర్వాత కొద్ది కాలానికి ఆమె కుటుంబం కోల్ కత్తాకి మారింది.
అక్కడే ఆమె మోడలింగ్ అవకాశాల కోసం ప్రయత్నించింది. 12 ఏళ్ల కే బ్యూటీ కాంటెస్ట్లో పాల్గొంది అయితే ఓవర్ వెయిట్ కారణంగా ఆమె రిజక్ట్ అయింది. ఆ తర్వాత తనను తాను మార్చుకుని ఆ బ్యూటి కాంటెస్ట్ లో పాల్గొని విన్ అయింది.మిస్ కోల్కత అందాల పోటీల్లో పాల్గొంది
ఆమె 1999లో వచ్చిన ప్రేమకోసం అనే తెలుగు సినిమాతో తన కెరీర్ ప్రారంభించింది. ఈ సినిమా నిర్మాత ఆమె పేరును ఆషా సైనిగా మార్చారు.ఒక జ్యోతిష్యుడి సలహాతో కొద్ది రోజులు మయూరి అని పేరు పెట్టుకుంది కలిసి రాలేదు తర్వాత ఆశ అనే పేరుతో ఉండిపోయింది. తర్వాత పది సినిమాల్లో సహాయక రోల్స్ చేసింది
ప్రేమ కోసం తర్వాత ఈవీవీగారు చాలా బాగుంది సినిమాకి తీసుకున్నారు . తర్వాత ఆమె సహాయ పాత్ర పోషించిన నరసింహ నాయుడు సినిమా మంచి విజయం సాధించింది.
ఆమె కెరియర్ లో టాలీవుడ్ లో నరసింహనాయుడు నువ్వు నాకు నచ్చావు ఈ రెండు సినిమాలు ఎనలేని పేర్లు తెచ్చాయి. లక్స్ పాప సాంగ్ తర్వాత ఎన్నో అవకాశాలు వచ్చాయి. తెలుగు తమిళ కన్నడ హిందీ మొత్తం 50 సినిమాల్లో నటించింది.భారత్ భాగ్య విధాత సినిమాతో హిందీ చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టింది
తర్వాత లవ్ ఇన్ నేపాల్ చిత్రంలో గాయకుడు సోనూ నిగంతో కలిసి నటించింది. నమ్మణ్ణ, గిరి అనే సినిమాతో కన్నడలో అడుగుపెట్టింది
సౌత్ సినిమా ఇండస్ట్రీలో రజినీకాంత్, విజయకాంత్, బాలకృష్ణ, వెంకటేష్, ప్రభు, కార్తీక్, జగపతి బాబు, రాజశేఖర్ ఇలాంటి నటుల సరసన సుమారు 50 కి పైగా సినిమాల్లో నటించింది. అంతేకాదు పలు సీరీయల్స్ లో కూడా అలరించిందిఆశ సైని. ఇటీవల దగ్గుబాటి రానా ఓటీటీ సిరీస్ రానా నాయుడు సీజన్ 2లో కూడా యాక్ట్ చేసింది.
ఆ ఇంట్లో అనే హారర్ థ్రిల్లర్ సినిమాలో నటనతో మెప్పించింది ఆశ సైని.
తెలుగులో చాలా బాగుంది, సర్దుకుపోదాం రండి, నవ్వుతూ బతకాలిరా, ప్రేమతో రా, నువ్వు నాకు నచ్చావ్, ఓ చిన్నదాన, 143, స్వామి, మైఖేల్ మదన కామరాజు, బ్రోకర్, చట్టం, ఆకాశంలో సగం, సహస్ర, ఆ ఇంట్లో సినిమాలు తెలుగులో ఆమెకి గుర్తింపు తెచ్చాయి. 2013 తర్వాత ఆమె తెలుగు సినిమాల్లో నటించలేదు హిందీ చిత్ర పరిశ్రమలోనే ఆమె ఉండిపోయింది. 12 ఏళ్ల తర్వాత తెలుగు బుల్లితెరపై బిగ్ బాస్ 9 తెలుగు సీజన్‌తో రీ ఎంట్రీ ఇచ్చింది ఆశ సైని.
2008లో ఫోర్జరీ, నకిలీ వీసా డాక్యుమెంట్ల కేసులో ఆశా షైనీని చెన్నై పోలీసులు అప్పట్లో అరెస్ట్ చేశారు, అయితే తన తప్పు లేదు అని ఆమె తెలిపింది కాని తమిళ పరిశ్రమ ఆమెపై నిషేదం విదించింది
తర్వాత ఈ కేసులో ఆమె నిర్దోషిగా తేలడంతో కోలీవుడ్ ఇండస్ట్రీ నిషేధాన్ని ఎత్తివేసింది. ఇక బిగ్ బాస్ హౌస్ లో ఎంట్రీ ఇస్తూ తన జీవితంలో జరిగిన చేదు సంఘటన కూడా పంచుకుంది.ఓ ప్రముఖ నిర్మాత తనను 14 నెలల పాటు చిత్రహింసలకు గురిచేశాడని, తన చేదు అనుభవాలను బహిరంగంగా పంచుకుంటూ ఆ నిర్మాత దారుణ ప్రవర్తన గురించి వెల్లడించింది.
20 ఏళ్ల వయసులో ప్రముఖ నిర్మాతను ప్రేమించింది. అయితే, కొద్ది రోజుల్లోనే అతని అసలు స్వరూపం బయటపడిందని, తనపై దారుణంగా ప్రవర్తించాడని, కడుపులో తన్నడంతో అక్కడ నుంచి పారిపోయి తల్లిదండ్రుల దగ్గరకు వచ్చేసింది.నటనను వదులుకోమని చిత్రహింసలు పెట్టేవాడు. చివరకు తల్లిదండ్రుల దగ్గర ఉండి కొన్ని నెలలకు కోలుకున్నాను అని తెలిపింది.
సో చూడాలి బిగ్ బాస్ హౌస్ లో ఆశా సైని ఆట ఎలా ఉంటుందో.