తెలంగాణలో గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ హైదరాబాద్ సిటీలో అత్యధిక సీట్లు గెలుచుకుంది. అయితే
ప్రస్తుతం చర్చ జరుగుతోంది జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నిక గురించే, ఈ ఉప ఎన్నిక గెలుపు బట్టి జీహెచ్ ఎంసీ ఎన్నికల ఫలితాలపై కూడా ఇది ఎఫెక్ట్ పడుతుంది అని రాజకీయ పార్టీలు ఆశలు పెట్టుకున్నాయి.
ఇక అన్నీ పార్టీల్లో కూడా ఆశావహుల లిస్ట్ పెద్దగానే ఉంది. కాంగ్రెస్ పార్టీలో హైదరాబాద్ నుంచి హస్తిన వరకూ పార్టీ పెద్దలతో మంతనాలు జరుపుతున్నారు టికెట్ కోసం.
ఎందుకంటే అంత ప్రస్టేజ్ సెగ్మెంట్ జూబ్లిహిల్స్. ఇటీవల మాగంటి గోపీనాధ్ ఇక్కడ ఎమ్మెల్యేగా ఉండి మరణించారు. దీంతో ఇక్కడ ఉప ఎన్నిక అనివార్యం అయింది.
అయితే ఏ పార్టీ తరపున ఆశావహులు ఎవరు ఉన్నారు అనేది చూస్తే, ముందు కాంగ్రెస్ నుంచి చూసుకుంటే, గత ఎన్నికల్లో పోటీ చేసిన అజహారుద్దీన్ ఈసారి కూడా తనకు టికెట్ ఇవ్వాలి అని కోరుతున్నారు. హస్తిన వేదికగా ఆయన మంతనాలు జరుగుతున్నారు.
నాన్ లోకల్‌కు టికెట్ ఇచ్చేది లేదని, స్థానికులకే టికెట్ అని స్టేట్ కాంగ్రెస్ లీడర్లు తెలియచేస్తున్నారు.
కాంగ్రెస్ పార్టీ నుంచి ఫిరోజ్ ఖాన్, రోహిన్ రెడ్డి, నవీన్ యాదవ్, విజయా రెడ్డి పేర్లు వినిపిస్తున్నాయి.
బీజేపీ నుంచి గతంలో పోటీ చేసిన లంకెల దీపక్ రెడ్డి అలాగే కీర్తి రెడ్డి, డాక్టర్ పద్మ వీరపనేని, బండారు విజయలక్ష్మి పేర్లు వినిపిస్తున్నాయి. ఇక ఎం.ఐ.ఎం సింగిల్ గా పోటికి వస్తుందా, లేదా ఏదైనా పార్టీతో కలుస్తుందా అనేది కాలం నిర్ణయించాలి.
బీఆర్‌ఎస్ తరఫున మాగంటి గోపీనాధ్ భార్య సునీత పేరు వినిపిస్తుంది, అయితే మెజార్టీ ఆమే పేరే తెరపైకి వస్తుంది. కచ్చితంగా కమ్మ సామాజిక వర్గానికి చెందిన వారికే బీఆర్ఎస్ ఇక్కడ టికెట్ ఇవ్వనుంది.
ఒకవేళ బీఆర్ఎస్ ఆలోచన చేస్తే పీజేఆర్ తనయుడు మాజీ ఎమ్మెల్యే విష్ణువర్దన్ రెడ్డి, రావుల శ్రీధర్‌రెడ్డి కూడా రేసులో ఉన్నారు.
జూన్ 8న బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ మరణించారు, దీంతో ఎన్నికల నిబంధనల ప్రకారం ఆరునెలల్లో ఉప ఎన్నిక జరగాలి.
2025 డిసెంబర్‌లోపు ఈ ఉప ఎన్నిక జరగనుంది.సెప్టెంబర్‌లో నోటిఫికేషన్ విడుదలై, అక్టోబర్ నెలాఖరులో ఉప ఎన్నిక నిర్వహించే అవకాశం ఉండవచ్చు.
బీఆర్ఎస్ కచ్చితంగా సిట్టింగ్ స్ధానం నిలబెట్టుకోవాలి అని చేస్తుంటే, కాంగ్రెస్ లీడర్లు మాత్రం సిటీలో కచ్చితంగా ఈసారి గెలుపు తమదే అవ్వాలి అని కంకణం కట్టుకున్నారు, ఇక బీజేపీ కూడా ప్రతిష్టాత్మకంగా భావిస్తోంది.
మరి ఇక్కడ పోటీ చాలా గట్టిగానే ఉండబోతోంది అనేది స్పష్టం అవుతోంది రాజకీయ పరిణామాలతో.