దేశం ముందుకు సాగాలి అంటే రవాణా చాలా ముఖ్యం.మన దేశంలో ప్రస్తుతం రోడ్లు రవాణా వ్యవస్ద చాలా బాగుంది. ఎకానమీ పరుగులు పెట్టాలి అంటే ఇదే కీలకం, ముఖ్యంగా అన్నీ స్టేట్స్ లో ప్రభుత్వం ఆర్టీసీ సర్వీసులు నడుపుతుంది. అలాగే ఎన్నో వేల ప్రైవేట్ ట్రావెల్స్ ఉన్నాయి.
అయితే లగ్జరీ ప్రయాణం కేవలం విమానాలు రైళ్లలోనే కాదు బస్సుల్లో కూడా అందుబాటులోకి వచ్చింది. ఇక సుఖంగా పడుకుని ప్రశాంతంగా ప్రయాణం చేసే హైటెల్ లగ్జరీ బస్సులు ఉన్నాయి. ఇక కొన్ని బస్సుల్లో టాయిలెట్ సదుపాయాలు కూడా కల్పిస్తున్న ట్రావెల్స్ సంస్దలు ఉన్నాయి.
అయితే తాజాగా విమానాలలో ఎయిర్ హోస్టెస్‌లు ఉన్నట్లే బస్సులలో కూడా బస్ హోస్టెస్‌లు రానున్నారు. ఈ విషయం కేంద్రమంత్రి నితిన్ గడ్కరి తెలియచేశారు .
భారతదేశంలో ప్రజా రవాణా వ్యవస్థను మెరుగుపరచడానికి తాను కృషి చేస్తున్నానని కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ బిజినెస్ స్టాండర్డ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సమ్మిట్ సందర్భంగా తెలియచేశారు.
ప్రభుత్వం అన్నీ సదుపాయాలు కొత్త హంగులతో ఎలక్ట్రిక్ బస్సులు నడపడానికి ఒక ప్లాన్ తో వర్క్ చేస్తోంది, ప్రయాణికులకి అల్పాహారం, ఫుడ్, ఫ్రూట్స్, వాటర్ కాఫీ టీ ఇలా అన్నీ అందించనున్నారు. అయితే ఇది ఇంకా ప్రాజెక్ట్ దశలో ఉంది. దీనికి టాటా సహకారం తీసుకుంటున్నారు.
ఈ బస్సు ఛార్జీ విషయానికొస్తే డీజిల్ బస్సుల కంటే ఇది దాదాపు 30 శాతం తక్కువగా ఉంటుంది అంటున్నారు. ప్రయాణికులకి మెరుగైన సౌకర్యవంతమైన ప్రయాణం అందించడానికి ఈ నిర్ణయం చేస్తున్నాము అన్నారు.
కొండ ప్రాంతాలలో ముఖ్యంగా హిమాచల్, ఉత్తరాఖండ్‌లలో ప్రయాణాల విషయంలో సమస్యలు ఉంటున్నాయి. సొరంగాలు టన్నెల్ గుహల దగ్గర టెక్నాలజీ వాడనున్నారు. ఇక్కడ ఏఐ టెక్నాలజీ ఇప్పటికే చాలా ఉపయోగపడుతోంది. ఇంకా మరింత విస్తృతంగా దీనిని ఉపయోగిస్తాము అనే విషయం తెలియచేశారు. ఈ బస్సులు అందుబాటులోకి వస్తే ప్రయాణం మరింత లగ్జరీగా సౌకర్యవంతంగా ఉండనుంది.