ఈ రోజుల్లో వ్యాపారం చేయాలంటే లక్షల్లో పెట్టుబడి అవసరం. అయితే కాంపిటీషన్ కూడా అలాగే ఉంటోంది. కానీ ఈరోజు మనం చాలా తక్కువ పెట్టుబడితో చేసుకునే కొన్ని వ్యాపారాల గురించి తెలుసుకుందాం. అయితే కొందరు ఉద్యోగం చేయడానికి ఇష్టపడరు సొంత కాళ్లపై నిలబడి వ్యాపారం చేసుకోవాలి అని ఆలోచన చాలా మందికి ఉంటుంది. అయితే పెట్టుబడి లేక ఇబ్బంది పడతారు. బయట వడ్డీలకు తెచ్చుకున్నా దాదాపు రెండు నుంచి మూడు రూపాయలు నూటికి వడ్డీ ఉంటుంది. అందుకే చాలా మంది వ్యాపారం చేయాలి అంటే భయపడుతున్నారు. మరి తక్కువ పెట్టుబడితో ఎలాంటి వ్యాపారాలు చేసుకోవచ్చు అనేది ఈ రోజు మనం కొన్ని ఎగ్జాంపుల్ గా తెలుసుకుందాం.
*టిఫిన్ బండి లేదా టిఫిన్ సర్వీస్ *
చాలా మంది ఇప్పుడు బయట ఫుడ్ ని ఇష్టపడుతున్నారు, అతి తక్కువ ఇన్వెస్ట్ మెంట్ తో మొబైల్ బైక్, మొబైల్ వ్యాన్ పై కూడా మీరు టిఫిన్ అమ్మవచ్చు. చాలా చోట్ల చిన్న బడ్డీలాంటిది బండి లాంటిది ఏర్పాటు చేసుకుని ఈ బిజినెస్ చేస్తున్నారు. మీ దగ్గర టిఫిన్ సూపర్ టేస్ట్ ఉంటే చాలు, కస్టమర్ ఎంత దూరం నుంచి అయినా మీ దగ్గర టిఫిన్ తినడానికి వస్తారు. సో ఇది 50 వేల నుంచి 1 లక్ష రూపాయల పెట్టుబడితో స్టార్ట్ చేసుకోవచ్చు. దీనికి ఎలాంటి రిజిస్ట్రేషన్లు ఉండవు ఈజీగా ఈ బిజినెస్ చేయవచ్చు.
ఫోటోగ్రఫీ
దీనికి చూస్తే మీకు కెమెరా అలాగే ఎడిటింగ్ స్కిల్ ఉంటే మీ ఊరిలోనే దీనిని మీరు స్టార్ట్ చేసుకోవచ్చు. అంతేకాదు చాలా తక్కువ పెట్టుబడితో చేయవచ్చు. మీకు కెమెరా లేకపోయినా రెంట్ కి తీసుకువచ్చి దాని నుంచి మనీ ఎర్న్ చేయవచ్చు. దీని వల్ల ఈవెంట్ ఉన్న సమయంలో మీరు కెమెరా తీసుకుని ఆ వర్క్ అయ్యాక వారికి ఇవ్వవచ్చు. దానికి రెంట్ పే చేస్తారు. ఇలా నెలకి 30 వేల వరకూఎర్న్ చేస్తున్న వారు ఎందరో ఉన్నారు. దీనికి కూడా చాలా తక్కువ 50 వేల నుంచి 1 లక్ష రూపాయల పెట్టుబడి అవసరం అవుతుంది. కేవలం మీకు కంప్యూటర్ లేదా ల్యాప్ ట్యాబ్ ఉంటే సరిపోతుంది.
- సోప్స్ కాండిల్స్ తయారీ*
ఇది కూడా చిన్న తరహా యూనిట్ గా స్టార్ట్ చేసి మంచి లాభాలు సంపాదించుకోవచ్చు. మీరు కేవలం లక్ష రూపాయల ఇన్వెస్ట్ మెంట్ లోపే దీనిని స్టార్ట్ చేసుకోవచ్చు. కాండిల్స్ కి కాస్త డిమాండ్ తగ్గినా సోప్స్ కి మాత్రం డిమాండ్ ఎక్కువగానే ఉంది. ఈ రెండు స్టార్ట్ చేసుకుంటే సీజన్ వైస్ బిజినెస్ బాగుంటుంది. ఎందుకంటే ఇప్పటికీ మార్కెట్లో మీడియం రేట్స్ కి వచ్చే సోప్స్ కి మంచి స్కోప్ ఉంది. - ట్యూషన్ లేదా ఆన్‌లైన్ కోచింగ్*
మీకు ఏదైనా సబ్జెక్ట్ లో మంచి టాలెంట్ ఉంటే కచ్చితంగా ట్యూషన్స్ ఆన్ లైన్ కోచింగ్ చెప్పవచ్చు. దీని వల్ల మీకు పెట్టుబడి లేకుండానే ఆదాయం వస్తుంది. మ్యాధ్స్ సైన్స్ ట్యూషన్స్ చెబుతూ నెలకి 20 వేల వరకూ ఎర్న్ చేసేవారు చాలా మంది ఉన్నారు. ఇక ఆన్ లైన్ లో నెలకి క్లాస్ చెప్పి నెలవారి డబ్బులు పొందవచ్చు. - మొబైల్ రిపేర్ *
ఇది మీరు కోచింగ్ తీసుకుని మీరు ఉన్న ఏరియాలో స్టార్ట్ చేసుకోవచ్చు. రోజుకి రెండు మూడు ఫోన్లు బాగు చేసినా కచ్చితంగా నెలకి 30 వేల సంపాదన మీ సొంతం. అయితే మంచి టెక్నిషియన్ గా పేరు పొందితే మీరే చాలా మందికి నేర్పించవచ్చు. ఉపాధి కల్పించవచ్చు. మొత్తం 30 వేల పెట్టుబడితో దీనిని స్టార్ట్ చేసుకోవచ్చు.
ఈ చిన్న చిన్న వ్యాపారాలు అతి తక్కువ పెట్టుబడి అంటే ఒక లక్ష రూపాయల లోపు పెట్టుబడితో స్టార్ట్ చేసుకోవచ్చు.