
బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్, 2020 జూన్ 14న ముంబైలోని తన అపార్ట్మెంట్లో తన మృతదేహం కనిపించింది. ముంబై పోలీసులు చేపట్టిన ప్రాథమిక విచారణలో అతను ఆత్మహత్య చేసుకున్నాడు అని తెలిపారు. పోస్టుమార్టం నివేదికలో కూడా ఉరివేసుకొని చనిపోయాడని తెలిపారు.
సిబిఐ గత కొన్ని సంవత్సరాలుగా ఈ కేసు మీద ఇన్వెస్టిగేషన్ చేస్తూ వస్తుంది. సిబిఐ కోర్టులో ఇన్వెస్టిగేషన్ చేసిన పూర్తి వివరాలను మెజిస్ట్రేట్ ముందు ఉంచింది. ఇందులో ఎటువంటి హత్య ప్రయత్నం జరగలేదు. సాధారణ ఆత్మహత్య గా గుర్తించారు. అదేవిధంగా డాక్యుమెంట్స్ అన్నీ కూడా సిబిఐ కోర్టు ముందు సిబిఐ సబ్మిట్ చేసింది. కానీ ఈ కేసు ఇప్పుడే క్లోజ్ అయిందని చెప్పలేము, ఎందుకంటే మెజిస్ట్రేట్ దానిని పరిశీలించి అది సమ్మతమే అయితే దాన్ని క్లోజ్ చేయవచ్చు లేనిచో దాని తిరిగి మరల ఓపెన్ చేసే హక్కు మెజిస్ట్రేట్కు కలిగి ఉంది.