🔴 పాత విధానంలో (అక్టోబర్ 3, 2025 వరకు)
- చెక్కులు బ్యాచ్‌లుగా (ఉదయం / మధ్యాహ్నం) ప్రాసెస్ అవుతు ఉండేది.
- క్లియరింగ్ → సెటిల్మెంట్ → అకౌంట్‌లో డబ్బు = సాధారణంగా తరువాతి రోజు (T+1) వస్తు ఉండేది..
- ఉదా: సోమవారం ఉదయం 11 గంటలకు చెక్కు డిపాజిట్ చేస్తే, డబ్బు మంగళవారం సాయంత్రం మాత్రమే వచ్చేది.
RBI కొత్త విధానంలో
📆 అమలు దశలు
🔹 దశ 1 (అక్టోబర్ 4, 2025 – జనవరి 2, 2026)
- రోజు పొడవునా వచ్చిన చెక్కులకు బ్యాంక్ సాయంత్రం 7 గంటల లోపే కన్ఫర్మ్ చేయాలి.
- Drawee BANK respond కానప్పుడు మనీ అనేది ఆటో-అప్రూవ్ అవుతుంది.
- డబ్బు అదే రోజు వస్తుంది.
🔹 దశ 2 (జనవరి 3, 2026 నుండి)
- మరింత కఠినమైన గడువు: చెక్కు డిపాజిట్ చేసిన 3 గంటల్లోపే బ్యాంక్ కన్ఫర్మ్ చేయాలి.
- ఉదా:
- 10–11 am లో చెక్కు డిపాజిట్ చేస్తే → మధ్యాహ్నం 2 గంటల లోపు కన్ఫర్మ్ అవ్వాలి.
- 2–3 pm లో చెక్కు డిపాజిట్ చేస్తే → సాయంత్రం 6 గంటల లోపు కన్ఫర్మ్ అవ్వాలి.
👨💼 కస్టమర్లకు ఉపయోగాలు
✅ ప్రయోజనాలు
- చెక్కు క్లియరింగ్ వేగంగా = డబ్బు అదే రోజు వస్తుంది.
- 2–3 రోజులు వేచి ఉండాల్సిన అవసరం లేదు.
- పట్టణం లేదా గ్రామం అనే తేడా లేకుండా, దేశవ్యాప్తంగా ఒకే విదంగా.
⚠️ గమనించాల్సినవి
- చెక్కులు మధ్యాహ్నం 3–4 గంటలలోపు డిపాజిట్ చేస్తే అదే రోజు క్లియర్ అవుతాయి.
- చెక్ వ్రాసిన వ్యక్తి అకౌంట్‌లో సరిపడా బ్యాలెన్స్ ఉండాలి, లేదంటే ఆటో-అప్రూవ్ అయిన తర్వాత బౌన్స్ అయితే ఛార్జీలు పడుతాయి.
- ప్రారంభ రోజుల్లో (అక్టోబర్ 4–10 వరకు) కొంచెం ఆలస్యం జరగొచ్చు.