సినిమా ఇండస్ట్రీలో ఎంత మంది స్టార్లు ఉన్నా మెగాస్టార్ స్ధాయి వేరు, ఆయన నటుడిగానే కాదు మంచి మనసున్న వ్యక్తిగా పేరు సంపాదించుకున్నారు.
150 సినిమాలు చేసి తెలుగు ప్రేక్షకుల మదిలో స్టార్ గా మారిపోయారు. అయితే కోట్ల ఆస్తులు ఉన్నా కొందరు సాయిం చేయడానికి అస్సలు ముందుకు రారు. కానీ మెగాస్టార్ అలా కాదు.
తన సంపాదనలో ఎంతో కొంత తన అభిమానులకి, అలాగే సాయం అని కోరే ఎంతో మందికి నేనున్నాను అని భరోసా ఇస్తారు. అయితే కొడుకు రామ్ చరణ్ ఆయన కోడలు ఉపాసన కూడా అంతే స్ధాయిలో సేవా కార్యక్రమాలు చేస్తారు.
టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతో మందికి సాయం చేసిన మెగాస్టార్ , కరోనా సమయంలో కూడా నగదు సాయం, కిరాణా వస్తువులు సాయం చేసి చాలా మంది కార్మికులని ఆదుకున్నారు.
అపోలో ఆస్పత్రిలో ఎంతో మందికి వైద్యం అందించారు. ఎంతో మంది చావు బతుకుల మధ్య బెడ్స్ దొరకని స్దితిలో అపోలో ఆస్పత్రిలో తన కోడలు ద్వారా బెడ్స్ ఆక్సిజన్ ఏర్పాటు చేయించి కరోనా నుంచి కాపాడారు.
ఇటీవల ఓ నటుడు మెగాస్టార్ చేసిన సాయం గురించి చెప్పి ఆయన మంచి మనసు గురించి వివరించాడు. ఆ నటుడు ఎవరో కాదు? తెలుగు తమిళ చిత్రాల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు
పొన్నాంబళం.
ఇండస్ట్రీలో పవర్ ఫుల్ విలన్ గా ఓ వెలుగు వెలిగారు పొన్నాంబళం. తొలి రోజుల్లో స్టంట్‌మ్యాన్‌గా సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఆయన విలన్ గా మారారు. తమిళం, తెలుగు, కన్నడం, మలయాళ భాషల్లో సుమారు 1500 చిత్రాల్లో నటించారు.
అయితే రోజులు ఎప్పుడూ ఒకేలా ఉండవు ఆర్దికంగా పెద్దగా ఆయన సంపాదించింది లేదు.
వ్యక్తిగత జీవితంలో ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్నారు పొన్నాంబళం.
మూత్ర పిండాల వ్యాధి బారిన పడ్డారు. అయితే ఆస్పత్రిలో ఉన్న సమయంలో మెగాస్టార్ కి ఫోన్ చేసి సాయం అడిగారు. ఆయన ఒక లక్ష రూపాయలు సాయం చేస్తారు అనుకుంటే, ఉచితంగా పూర్తి వైద్యం చేయించారు.
సుమారు 50 లక్షల ఆర్దిక సాయం చేశారు. ఇటీవలే మళ్లీ తీవ్ర అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరిన పొన్నాంబళంకు మరోసారి సాయం చేశారు. మొత్తం నాకు ఆరోగ్యానికి వైద్య సాయానికి కోటి రూపాయల వరకూ మెగాస్టార్ తనకు సాయం చేశారు అని చెప్పారు పొన్నాంబళం.
అందుకే మెగాస్టార్ గ్రేట్ అంటారు అందరూ కూడా. ఎంతో మంచి మనసున్న వ్యక్తి, డబ్బు అందరికి ఉంటుంది కానీ ఇలా సాయం చేసే గుణం కొందరికి మాత్రమే ఉంటుంది.