మెగాస్టార్ చిరంజీవికి ఇటీవలి వెన్నుముక భాగంలో స్వల్ప శస్త్రచికిత్స జరిగినట్టు వార్తలు వస్తున్నాయి. నొప్పి నుంచి రిలీఫ్ కోసం హైదరాబాద్‌లో ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో ఈ చికిత్స చేయించుకున్నారని టాక్.
ప్రస్తుతం ఇంటికే పరిమితమై పూర్తిగా రెస్ట్ తీసుకుంటున్నారని తెలుస్తోంది. అందుకే ‘మన శంకరవరప్రసాద్ గారు’ ప్రమోషన్స్‌కు నేరుగా హాజరు కావడం లేదని టాలీవుడ్ వర్గాల్లో చర్చ జోరుగా నడుస్తోంది.
త్వరలో జరగబోయే ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కూ ఆయన హాజరయ్యే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నట్లు చెబుతున్నారు.
అయితే అభిమానులను నిరాశపరచకూడదనే భావంతో, సోషల్ మీడియా లేదా వీడియో సందేశం ద్వారా మాత్రం కనెక్ట్ అయ్యే అవకాశం ఉందని సమాచారం.
పూర్తిగా కోలుకున్న తర్వాత పబ్లిక్ ఈవెంట్లలో కనిపిస్తారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు.