మలయాళ సినిమా ఇండస్ట్రీలో నటీమణుల పై వేధింపుల గురించి ఎన్నో వార్తలు మనం వింటూ వచ్చాం.
తాజాగా కేరళ సినిమా ఇండస్ట్రీలో ఒక లైంగిక వేధింపుల కేసు రోజురోజుకూ తీవ్రమౌతోంది..
ప్రభుత్వం నియమించిన హేమ కమిటీ నివేదిక రావడంతో, తాము ఎన్నో రోజులుగా ఇలాంటి వారి టార్చర్ భరిస్తున్నాము అంటూ చాలా మంది బయటకు వస్తున్నారు.
తాజాగా మరో ఘటన ఇప్పుడు అక్కడ సినిమా పరిశ్రమలో రాజకీయ వర్గాల్లో కలకలం రేపింది.
మాజీ జర్నలిస్టు అండ్ స్టార్ హీరోయిన్ రిని ఆన్ జార్జ్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ఓ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే హోటల్‌కు రమ్మని వేధిస్తున్నాడంటూ ఆమె ఓ కీలక విషయాన్ని బయటపెట్టింది.
ఈ టార్చర్ కొన్ని సంవత్సరాలుగా జరుగుతోందంటూ ఆమె సంచలన నిజం భయపెట్టింది. అంతేకాదు ఆ ఎమ్మెల్యే 5 స్టార్ హోటల్ లో రూమ్ బుక్ చేశాను, అక్కడకి రమ్మని మెసేజ్ లు చేస్తున్నాడు అని తెలిపింది, అయితే భద్రతా కారణాలతో అతని పేరు ఆమె తెలియచేయడం లేదు.
మూడు సంవత్సరాలుగా ఈ వేదింపులు ఉన్నాయని అప్పట్లో తక్కువ కానీ, ఇటీవల మరింత రెచ్చిపోతున్నాడు అంటూ ఆమె వాపోయింది .అయితే కాంగ్రెస్ పార్టీలో సీనియర్లకు చెప్పినా పెద్దగా ప్రయోజనం లేదని,
అతని ఎవరూ పట్టించుకోలేదని అతని టార్చర్ ఆగడం లేదని బాధఫడింది రిని ఆన్ జార్జ్ .. ఇలా చెప్పినందుకు ఆ ఎమ్మెల్యే తనకు ఎవరూ చెప్పలేరు, నువ్వు ఎవరికి ఏం చెప్పినా నన్ను ఎవరూ ఏమీ చేయలేరు, నువ్వు ఏం చేసుకుంటావో చేసుకో అంటూ మరింత టార్చర్ చేస్తున్నాడు అని తెలిపింది రిని ఆన్ జార్జ్..