ఆగస్టు 14 న రజనీకాంత్ నటించిన కూలి సినిమా విడుదలైంది. ఈ సినిమా సూపర్ పాజిటీవ్ టాక్ తో దూసుకువెళుతోంది. అయితే కూలి సినిమా ప్రముఖ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించారు. ఇందులో
టాలీవుడ్ కింగ్ నాగార్జున్ తన కెరీర్ లో తొలిసారి విలన్ పాత్ర పోషించారు. విలన్ గా నాగ్ అద్బుతంగా నటించారు.
తన సినీ కెరీర్ లో ఫస్ట్ టైమ్ విలన్ గా చేశారు మన్మథుడు. ఫస్ట్ డే వరల్డ్ వైడ్ గా రూ.151 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లు సాధించింది కూలి సినిమా.
ఇక ఇప్పటికే 250 కోట్లకు పైగానే కలెక్షన్ మార్క్ అందుకుంది రజనీ సినిమా. ఈ సినిమాలో ఉపేంద్ర, శృతిహాసన్, అమీర్ ఖాన్ కీలకపాత్రలు చేశారు. ఇక సౌబిన్ షాహిర్ కి ఈ సినిమాలో నటనతో మరింత పేరు వచ్చింది.
ఇప్పుడు ఈ సినిమాలో విలన్ పాత్రలో కనిపించి అందరి దృష్టిని ఆకట్టుకుంది ప్రముఖ హీరోయిన్ రచితా రామ్. స్టార్ హీరోయిన్ ని విలన్ గా చేశారు ఏమిటి అని కొందరు షాక్ అయ్యారు, అయినా పాత్ర అదిరిపోయింది అని కామెంట్లు చేస్తున్నారు సినిమా చూసిన వారు.
డబ్బు కోసం సైమన్ కుమారుడిని వలలో వేసుకునే మహిళగా చాలా అద్భుతంగా నటించింది ఈ స్టార్ హీరోయిన్. కన్నడ స్టార్ హీరోయిన్ రచితా రామ్ నటన పై ప్రశంసలు వస్తున్నాయి.
గతంలో ఆమె తెలుగులో ఒక సినిమాలో నటించారు. మెగాస్టార్ రెండో అల్లుడు కళ్యాణ్ దేవ్ నటించిన సూపర్ మచ్చి సినిమాతో ఆమె తెలుగులో హీరోయిన్ గా నటించింది. పెద్దగా ఈ సినిమా హిట్ అవ్వలేదు, ఆ తర్వాత సినిమా అవకాశాలు రాలేదు.
ఇక ఆమెకి కన్నడలో మాత్రం చాలా అవకాశాలు వచ్చాయి. అక్కడ పునీత్ రాజ్ కుమార్, దర్శన్, సుదీప్,ఉపేంద్ర, శివరాజ్ కుమార్ ఇలా అందరు స్టార్ హీరోలతో సినిమాలు చేశారు. అయితే కూలి సినిమాలో ఆమె ఈ పాత్రకు బాగుంటారు అని లోకేష్ ఆమెని సంప్రదించి తీసుకున్నారు. ఈ సినిమాలో ఆమె రోల్ కి మంచి అప్లాజ్ వచ్చింది.