ఆగస్ట్ 14 ఈ డేట్ ఈ ఏడాది ఎవరూ మర్చిపోరు. ఎందుకంటే ఇండియన్ సినిమా హిస్టరీలో ఒకే రోజు రెండు అతి పెద్ద చిత్రాలు రిలీజ్ అవుతున్నాయి. సూపర్ స్టార్ రజనీకాంత్ కూలీ సినిమాతో పాటు తారక్ హృతిక్ కలిసి నటించిన వార్ 2 ఈ రెండు సినిమాలు ఒకే రోజు విడుదల అవుతున్నాయి. రెండు చిత్ర యూనిట్లు కూడా కచ్చితంగా ఎన్నో ఆశలు పెట్టుకున్నాయి ఈ సినిమాలపై. కూలి సినిమాలో కాస్టింగ్ గురించి చెప్పుకోవాలి
రజనీకాంత్, నాగార్జున,అమీర్ ఖాన్, ఉపేంద్ర, సౌబిన్ సాహిర్,శృతిహాసన్, పూజా హేగ్డే
దాదాపు అగ్రస్టార్లతో ఈ సినిమా తీశారు.
ఇక తారక్ హృతిక్ రోషన్ కూడా వార్ 2 పై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. డిజిటల్ – సోషల్ మీడియాలో ఈ రెండు సినిమాలకు ఓ రేంజ్ లో బజ్ కనిపిస్తోంది. ఓవర్సీస్ మార్కెట్లో మాత్రం నువ్వా నేనా అన్న రేంజ్ లో ప్రీ కలెక్షన్స్, అడ్వాన్స్ బుకింగ్స్ సాధిస్తున్నాయి. అయితే ఒకింత కూలీ సినిమాకి ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్ లో మంచి జోరు చూపిస్తోంది. అయితే ప్రస్తుతం ట్రెండ్స్ ప్రకారం కూలి సినిమాకి ఓవర్సీస్ లో విపరీతమైన బజ్ కనిపిస్తోంది. ఇక కేవలం ఒక్క రోజు మాత్రమే అక్కడ ప్రదర్శనకు సమయం ఉంది.
అభిమానులు అయితే ఏ సినిమా బాక్సాఫీస్ దగ్గర సత్తా చాటుతుంది అనేది మాట్లాడుకుంటున్నారు. అయితే ఒకే రోజు రెండు సినిమాలు రీలీజ్ ఉండటంతో ధియేటర్ల సమస్య ఎక్కువ కనిపిస్తుంది. ఇప్పుడు వీటికి అదే లోటు ఉంది. ముఖ్యంగా పండుగ సమయాల్లో అయితే నాలుగు షోలని రెండు సినిమాలకి సమానంగా పంచుతారు. ఇలా నాన్ ఫెస్టివల్ టైమ్ లో అయితే ఎగ్జిబిటర్లు అనేక ఈక్వేషన్స్ చూస్తారు.
నిర్మాతలు ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లతో మంతనాలు జరిపి ప్రైస్ ప్రకారం ఈ సినిమాలు ప్రదర్శన ఉంటాయి.
ఫస్ట్ డే ఎక్కువ ధియేటర్లు ఎవరికి దొరికితే వారిది బంపర్ నెంబర్ అవుతుంది. అంటే కలెక్షన్స్ పెరిగేందుకు అవకాశం ఉంటుంది. అయితే మన దేశంలో మొత్తం 6877 ధియేటర్లు ఉన్నాయి. ఎక్కువగా ఆంధ్రప్రదేశ్ అలాగే తమిళనాడు ఈ రెండు ప్లేస్ లలలో ఎక్కువ ధియేటర్లు ఉన్నాయి..
ఆంధ్రప్రదేశ్‌లో అత్యధిక థియేటర్లు 1,097 ఉండగా, తమిళ నాడులో 943,
తెలంగాణలో 485 థియేటర్లు ఉన్నాయి.
మేజర్ థియేటర్లన్నింటిని కూలీ, వార్ 2 ఆగస్టు 14 నుంచి బ్లాక్ చేసాయి. దాదాపు మొత్తం ధియేటర్లలో 93 శాతం ఈ రెండు సినిమాలు బ్లాక్ చేశాయి.
ప్రస్తుతం ట్రెండ్స్ ప్రకారం తొలి రోజు వార్ 2 సినిమాకి తెలంగాణ, ఏపీలో ఎక్కువ ధియేటర్లు దక్కే అవకాశం ఉంది తమిళనాడు కర్ణాటక మహారాష్ట్ర ఈ ప్రాంతాల్లో కూలికి ఎక్కువ ధియేటర్లు దక్కనున్నాయి.
సో ఫస్ట్ డే కలెక్షన్స్ బట్టి విన్నర్ తెలుస్తుంది అంటున్నారు సినిమా అనలిస్టులు.
మరి మీరు ఏ సినిమా కోసం వెయిటింగ్ తప్పక కామెంట్లో తెలియచేయండి.