సివిల్ లైన్స్ క్యాంప్ ఆఫీస్‌లో జరిగిన జన్ సున్వాయి కార్యక్రమం సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. పౌరుల ఫిర్యాదులు వింటున్న సమయంలో, గుజరాత్‌కి చెందిన రాజేష్ సాకారియా అనే వ్యక్తి పిటిషన్ ఇస్తున్నట్లు వచ్చి, ఒక్కసారిగా సీఎం రేఖా గుప్తా గారి పై దాడి చేశాడు. ఆమెను తోసివేసి , చెంప మీద కొట్టే ప్రయత్నం చేసినట్లు తెలుస్తోంది.
సెక్యూరిటీ సిబ్బంది వెంటనే స్పందించి దాడి చేసిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం అతను పోలీసులు కస్టడీలో ఉన్నాడు. ఈ ఘటనపై అటెంప్ట్ టు మర్డర్ కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు.
సీసీటీవీ ఫుటేజ్‌లో నిందితుడు ముందుగా రిక్కి చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ముఖ్యమంత్రి రేఖా గుప్తా స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ఆమె ప్రస్తుతం సురక్షితంగా ఉన్నారు కానీ ,ఈ ఘటనతో ఢిల్లీ రాజకీయాల్లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.
https://www.ndtv.com/delhi-news
బీజేపీ నేతలు ఈ దాడిని తీవ్రంగా ఖండించగా, ఆప్ నాయకులు కూడా రాజకీయ హింస ఆగాలంటూ స్పందించారు. దాడి వెనుక నిజమైన కారణం ఏమిటో తెలుసుకునేందుకు పోలీసులు లోతుగా విచారణ చేస్తున్నారు.
https://www.thehindu.com/news/cities/Delhi
ఈ ఉదయం జరిగిన ఈ దాడి ఢిల్లీ మొత్తం షాక్‌కు గురిచేసింది.”