కర్ణాటకలోని దక్షిణ కన్నడ జిల్లాలో ఉన్న ధర్మస్థల ఇప్పటి వరకు ఇది మంజునాథుడి ఆలయం నుంచి ఆధ్యాత్మిక ప్రాంతంగానే అందరికి తెలుసు.
అయితే గత కొన్ని నెలలుగా ఒక సంఘటన దేశ వ్యాప్తంగా చర్చకు కారణం అయింది. గత నెలలో ఓ న్యాయవాదితో కలిసి అక్కడి పోలీసుస్టేషన్‌కు వచ్చిన వ్యక్తి చేసిన ఫిర్యాదు అందరినీ ఉలిక్కిపడేలా చేసింది.
ధర్మశాల దేవాలయంలో పారిశుద్ధ్య కార్మికుడిగా పని చేసిన తాను దాదాపు 20 ఏళ్ల పాటు అనేక మృతదేహాలను పాతిపెట్టానని బాంబు పేల్చాడు.
అలా చనిపోయిన వారిలో మహిళలు, చిన్నారులు ఉన్నారని, కొందరిపై అత్యాచారం జరిగినట్లు, మరికొందరిపై యాసిడ్ దాడులకు సంబంధించిన గుర్తులు ఉన్నాయని అంతా ఉలిక్కిపడేలా చేశాడు. ఆ మృతదేహాలని తాను పూడ్చాను అని సంచలన విషయాలు చెప్పాడు.
అయితే ఆ వ్యక్తి ఇలాంటి విషయాలు చెప్పడంతో, పోలీసులు కేసు నమోదు చేశారు, దీనిని సిద్దరామయ్య సర్కార్ చాలా సీరియస్ గా తీసుకుంది.
అక్కడ కర్ణాటక ప్రభుత్వం సిట్ వేసింది. సాక్షి చెబుతున్న చోట్ల తవ్వకాలు జరుపుతోంది… ఈ అంశం పై సిట్ అధికారులు ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు.
విజిల్ బ్లోయర్ ఇచ్చిన ఆధారాలు, చెప్పిన విషయాలతో ధర్మస్థల లో తవ్వకాలు ముమ్మరంగా సాగుతున్నాయి. అయితే కొన్ని చోట్ల కొన్ని ఆనవాళ్లు దొరికాయి. అయితే వాటిపై లోతైన పరిశోధన చేస్తున్నారు అధికారులు.
తాజాగా మరో విషయం చెప్పాడు ఆ సాక్షి, ఒకేచోట దాదాపు 80 మృతదేహాలను తానే గొయ్యి తవ్వి పాతేశానుఅంటున్నాడు, ఈ మాట వినడానికి కూడా కాస్త ఆశ్చర్యంగానే ఉంది అంటున్నారు అధికారులు
ప్రజలు అయితే అన్నీ కోణాల్లో విచారణ చేస్తుంది సిట్. 1998 నుంచి 2014 మధ్య శానిటైజేషన్ వర్కర్‌గా పనిచేసిన ఆ వ్యక్తి ఈ కీలక విషయాలు బయటపెట్టాడు.
ఇప్పుడు ఎందుకు ఈ విషయాలు బయటపెట్టావు అని ప్రశ్నిస్తే, నేను చేసిన పాపం చెప్పాలి, నాకు నిద్ర పట్టడం లేదు ఆ శవాలు అస్దిపంజరాలు తనకు గుర్తు వస్తున్నాయి అని తెలియచేస్తున్నాడు.
నేత్రావతి నది ఒడ్డున ధర్మస్థల అటవీ ప్రాంతంలో తాను ఒక్కడినే చాలా శవాలను గొయ్యితీసి పాతిపెట్టినట్లు ఆ ప్రధాన సాక్షి తెలిపాడు.
ఆలయ పర్యవేక్షకులు తనకు ఈపని అప్పచెప్పారు అని వారు ఎవరూ తనతో నేరుగా చెప్పకపోయినా వారి సిబ్బందితో నాకు అమలు చేయమని చెప్పాడు అంటున్నాడు.
15 ప్రాంతాల్లో సిట్ అధికారులు తవ్వకాలు జరిపించగా.. సైట్ నంబర్ 6లో మాత్రమే ఓ మానవ అస్థిపంజరం లభించింది. సైట్ నంబర్ 13లో 80 మృతదేహాలను పాతిపెట్టినట్లు అతను చెబుతున్నాడు.
అయితే అక్కడ చాలా లోతుగా తాను శవాలను పూడ్చాను అంటున్నాడు. దానిపై కూడా విచారణ చేస్తున్నారు అధికారులు.
అటవీ ప్రాంతాలు, పాత రోడ్లపై మాత్రమే మృతదేహాలను పాతిపెట్టేవాళ్లం అని చెబుతున్నాడు. అయితే ఇప్పుడు చాలా మారిపోయింది ఆ ప్రాంతం.
రోడ్లు వెడల్పు అయ్యాయి అందులో కొన్ని తాను గుర్తుపట్టలేకపోతున్నాను అంటున్నాడు. వర్షాలతో భూమి కోతకు గురికావడం, అడవులు పెరిగిపోవడం, నిర్మాణ పనుల కారణంగా పాతిపెట్టిన ప్రాంతాలు తనకు అంతగా గుర్తు లేవు అంటున్నాడు, అయితే సిట్ మాత్రం మార్క్ చేసినవి గుర్తించి ప్రాంతాల్లో తవ్వకాలు చేస్తోంది.