రణవీర్ సింగ్ లీడ్ రోల్‌లో ఆదిత్య ధర్ తెరకెక్కించిన ‘ధురంధర్’ ఈ ఏడాదిలోనే అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది. దేశీయంగా మరియు ప్రపంచ వ్యాప్తంగా కలిపి ఈ సినిమా రూ.1100 కోట్లకు పైగా వసూలు చేసింది. అయితే మధ్యప్రాచ్య దేశాల్లో బ్యాన్ కారణంగా భారీ నష్టం వచ్చిందని అక్కడి డిస్ట్రిబ్యూటర్లు వెల్లడిస్తున్నారు. సౌదీ అరేబియా, UAE, బహ్రెయిన్, కువైట్, ఒమన్, ఖతర్ దేశాలు ఈ చిత్రాన్ని విడుదల చేయనందున దాదాపు రూ.90 కోట్ల లాస్ అయినట్లు తెలిపారు.
కొన్ని దేశాల్లో ఉన్న సెన్సార్ నిబంధనలు, కథలోని కొన్ని అంశాలపై అభ్యంతరాలు వ్యక్తం కావడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. సినిమా మీద ఉన్న అంతర్జాతీయ హైప్, ముందస్తు బుకింగ్స్‌ను దృష్టిలో పెట్టుకుంటే వసూళ్లు ఇంకా పెరిగేవని డిస్ట్రిబ్యూటర్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అయినప్పటికీ భారత్‌లో మరియు ఇతర మార్కెట్లలో ఈ సినిమా బంపర్ కలెక్షన్లు సాధించడం వల్ల ప్రొడక్షన్ హౌస్‌కు మాత్రం భారీగా లాభాలు వచ్చినట్టు తెలుస్తుంది.