ఇప్పుడంతా టెక్నాలజీ యుగం, మొత్తం ప్రపంచం యంత్రాల నుంచి టెక్నాలజీ వైపు నడుస్తోంది. డిజిటల్ విప్లవం అనే చెప్పాలి. గతంఓ ఒక ఆలోచన ఇంప్లిమెంట్ అయితే, ఇప్పుడు ఏఐతో వంద ఆలోచనలు వస్తున్నాయి. దానిలో ది బెస్ట్ ఎంచుకునే ఆప్షన్ కూడా మనకు కలుగుతోంది. అంత విరివిగా మనకు టెక్నాలజీ అందుబాటులోకి వచ్చింది.
అయితే వాట్సాప్ మన జీవితంలో భాగం అయిపోయింది, పోటీగా ఎన్ని మెసెంజర్ ప్లాట్ ఫామ్స్ వచ్చినా, దానిని బీట్ చేసింది మరొకటి రాలేదు. ఎలాన్ మస్క్ ఓ సంచలనం ఆయన ఇప్పుడు కొత్తగా ఓ ఆవిష్కరణకు సిద్దం అవుతున్నారు.
ఇదే ఇప్పుడు టెక్ ప్రపంచంలో చర్చకు కారణం అయింది.వాట్సాప్ , ఇన్‌స్టాగ్రామ్ , టెలిగ్రామ్ వంటి యాప్‌లకు పోటీగా మరో సంచలనాన్ని తీసుకొచ్చారు మస్క్.
WhatsApp కు పోటీగా ఎక్స్ యాప్ అదే ట్విట్టర్ – ఇప్పుడు ఎక్స్ చాట్ ( XChat )ను తీసుకొచ్చే ప్లాన్ చేస్తున్నారు. యూజర్స్ కి మంచి మెసేజింగ్ అనుభూతిని ఇవ్వనుందని, ప్రస్తుతం ఇది టెస్టింగ్ దశలో ఉంది .
ఎక్స్ చాట్ (XChat) పేరుతో చాట్ ఇంటర్ ఫేస్‌ను ప్రవేశపెట్టారు. ఇది మీరు నిరంతరాయంగా ఎవరికి అయినా టెక్ట్స్ చేసుకోవచ్చు.
సో వాట్సాప్ లో ఉండే ఫీచర్లు సెక్యూరిటీ సర్వీసెస్, ఫైల్స్ పంపడం ఇవన్నీ కూడా చేసుకోవచ్చు
అంతేకాదు సేమ్ ఆడియో వీడియో కాల్ కూడా మనం చేసుకోవచ్చు. సెక్యూర్ కనెక్షన్స్ కోసం ఎండ్ టూ ఎండ్ ఎన్‌క్రిప్షన్ అందిస్తుంది.
సో ఫోన్ నెంబర్లు లేకుండా మీ ఎక్స్ అకౌంట్ తో కాల్స్ చేసుకోవచ్చు. అయితే వాట్సాప్ కు ఇది గట్టి పోటీ ఇస్తుంది అంటున్నారు టెక్ నిపుణులు. త్వరలో కొంత మందికి ముందు అందుబాటులోకి తీసుకువస్తారు.
అయితే ఫస్ట్ ఇది ఎక్స్ పెయిడ్ యూజర్లు ఎవరు ఉన్నారో వారికి అందుబాటులో ఉండనుంది
పూర్తి స్ధాయి టెస్టింగ్ పూర్తి అయిన తర్వాత ఫీడ్ బ్యాక్ నుంచి లోపాలు సరిదిద్ది అందరికి అందుబాటులోకి తీసుకురానున్నారు మస్క్.