Monday, October 20, 2025
Homemoneyమహిళలకు గుడ్ న్యూస్ఉచితంగా కుట్టుమిషన్లుఎలా పొందాలంటే?

మహిళలకు గుడ్ న్యూస్ఉచితంగా కుట్టుమిషన్లుఎలా పొందాలంటే?

Published on

మ‌హిళ‌లు ఇప్పుడు అన్నీ రంగాల్లో రాణిస్తున్నారు. వారికి ఆర్దిక స్వాలంబ‌న క‌లిగించే దిశ‌గా ప్ర‌భుత్వాలు సాయం చేస్తున్నాయి. చాలా మంది మ‌హిళ‌ల‌కు ఆర్దిక స‌హాయం అలాగే వారికి ఉపాధి అవ‌కాశాలు క‌ల్పిస్తున్నాయి. సొంతంగా త‌మ కాళ్ల‌పై వాళ్లు నిల‌బ‌డేలా తోడ్పాటు అందిస్తున్నాయి ప్ర‌భుత్వాలు, తాజాగా ఏపీ ప్ర‌భుత్వం ఓ గుడ్ న్యూస్ వినిపిస్తోంది. మహిళలకు ఆర్థిక స్వావలంబన కలిగించే దిశగా అడుగులు వేస్తోంది ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో కూట‌మి ప్ర‌భుత్వం.

మహిళలు ఉచిత టైలరింగ్ శిక్షణ కార్యక్రమం ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఏపీ బీసీ కార్పొరేష‌న్ ద్వారా దాదాపు ఇప్ప‌టి వ‌ర‌కూ 46 వేల మంది మ‌హిళ‌ల‌కు ఉచితంగా కుట్టు మిష‌న్ శిక్ష‌ణ అందించారు. ఇక వీరంద‌రికి కొన్ని నెల‌లుగా ట్రైనింగ్ అయితే ఇస్తున్నారు. ఇక త్వ‌ర‌లో వీరు ట్రైనింగ్ పూర్తి చేసుకుంటారు, ట్రైనింగ్ పూర్తి అయ్యాక శిక్ష‌ణ పొందిన వీరికి కుట్టు మిష‌న్లు అందిస్తాము అని, ఏపీ బీసీ కార్పొరేషన్ ఛైర్ పర్సన్ రెడ్డి అనంతకుమారి తెలిపారు. ఇది మ‌హిళ‌ల‌కు గుడ్ న్యూస్ అనే చెప్పాలి. ఇలా కుట్టు మిష‌న్లు ఇవ్వ‌డం వ‌ల్ల ఆ మ‌హిళ‌లు ఇంటి ద‌గ్గ‌రే వారికి ఉపాధి క‌ల్పించేలా చేస్తోంది ప్ర‌భుత్వం. దీని వ‌ల్ల దూరం వెళ్లి ప‌నిచేయ‌లేని వారు కూడా ఇంటి ద‌గ్గ‌రే మంచి ఉపాధితో ఆర్దికంగా నిల‌దొక్కుకోవ‌చ్చు.

Also Read  బ్యాంకు ఖాతాల్లో మినిమం బ్యాలెన్స్ పై RBI గ‌వ‌ర్న‌ర్ కీల‌క కామెంట్స్..

ఇక మ‌రో గుడ్ న్యూస్ ఏమిటి అంటే బీసీ కార్పొరేష‌న్ నుంచి వేయి కోట్ల రూపాయల నిధులతో ఆదరణ పథకాన్ని పునఃప్రారంభిస్తామని తెలిపారు. ఇది కూడా రాష్ట్రంలో కులవృత్తుల వారికి ఉప‌యోగ‌క‌రంగా మార‌నుంది, ఇప్పటికే చాలా కుల‌వృత్తులు చేతి ప‌నివారు ఆ ఉపాధి నుంచి దూరం అవుతున్నారు. అలాంటి వారికి సాయంగా కులవృత్తుల వారికి పనిముట్లు అందించ‌నున్నారు. ఏపీలో ప్రస్తుతం 13 జిల్లాల్లో బీసీ కార్పొరేషన్‌ కార్యాలయాలు పనిచేస్తున్నట్లు వివరించారు. అంతేకాదు వెనుక‌బ‌డిన వారికి ఎలాంటి సాయం చేయాలి అనేదానిపై చ‌ర్చిస్తున్నారు.

ఇక చిన్న చిన్న వృత్తులు చేసుకుంటున్న వారికి చిన్న వ్యాపారాలు చేసుకునే వారిని ఆదుకునేందుకు ఈ ఏడాది రూ.200 కోట్లు సబ్సిడీ రుణాలు కల్పిస్తున్నట్లు వివరించారు. ఇది చిరు వ్యాపారుల‌కి చాలా మేలు చేకూర్చ‌నుంది.
పేద బీసీ విద్యార్థులకు ఉపకారవేతనాలతో పాటుగా విదేశీ విద్యారుణాలు అందిస్తాము అన్నారు. దీని వ‌ల్ల ఉన్న‌త చ‌దువులు చ‌దివి పెద్ద పెద్ద ఉద్యోగాలు పొంద‌వ‌చ్చు. మార్చి 8 న అంత‌ర్జాతియ మ‌హిళా దినోత్స‌వం సంద‌ర్బంగా కుట్టుమిష‌న్ల శిక్ష‌ణ ఏపీలో ప్రారంభించారు. దాదాపు ల‌క్ష మందికి టైల‌రింగ్ శిక్ష‌ణ ఇప్పించారు.ఈ శిక్ష‌ణ కేవ‌లం BC /EWS సామాజిక‌వ‌ర్గాల వారికి మాత్ర‌మే అందించారు.. 20 నుంచి 40 ఏళ్ల వయసు ఉన్న‌ వారికి శిక్ష‌ణ అందించారు. త్వ‌ర‌లో వీరికి కుట్టు మిష‌న్లు అందించ‌నున్నారు.

Also Read  ధనిక సీఎంల జాబితా

Latest articles

Google Data Center: APకి వెళ్లడం వెనుక ఉన్న నిజాలు..

గత కొన్ని రోజులుగా గూగుల్ సంస్థ ఆంధ్రప్రదేశ్‌లో భారీ పెట్టుబడులు పెట్టబోతోందనే వార్తలు హాట్ టాపిక్‌గా మారాయి. ఈ...

Revolut:భారత మార్కెట్‌లో UPI, Visa సేవలు.

లండన్‌కు చెందిన ప్రముఖ డిజిటల్ ఫైనాన్స్ కంపెనీ Revolut త్వరలో భారత్‌లో తన పేమెంట్ ప్లాట్‌ఫారమ్‌ను ప్రారంభించనుందని ప్రకటించింది....

cheque clearance: రేపటి నుంచి గంటల్లోనే చెక్ క్లియరెన్స్.

🔴 పాత విధానంలో (అక్టోబర్ 3, 2025 వరకు) చెక్కులు బ్యాచ్‌లుగా (ఉదయం / మధ్యాహ్నం) ప్రాసెస్ అవుతు ఉండేది. క్లియరింగ్...

ఒక్క ల‌క్ష ఉంటే చాలు ఈ బిజినెస్ లో మీకు తిరుగు ఉండ‌దు

ఈ రోజుల్లో వ్యాపారం చేయాలంటే ల‌క్ష‌ల్లో పెట్టుబ‌డి అవ‌స‌రం. అయితే కాంపిటీష‌న్ కూడా అలాగే ఉంటోంది. కానీ ఈరోజు...

ఈ స్కీమ్ లోపెట్టుబ‌డి పెడితే డ‌బ్బులు డబుల్

మ‌న దేశ ప్ర‌జ‌లు ప్ర‌భుత్వ బ్యాంకుల పోస్టాఫీసు్లో ఏదైనా స్కీమ్ క‌ట్టేందుకు ఇంట్ర‌స్ట్ చూపిస్తారు ఎందుకంటే సెక్యూరిటీ భ‌ద్ర‌త...

చిరిగిపోయిన క‌రెన్సీ నోట్లు మీ ద‌గ్గ‌ర ఉన్నాయా ఇక్క‌డ మార్చుకోండి

క‌రెన్సీకి ఎంతో విలువ ఉంటుంది. అయితే ప్ర‌జ‌ల మ‌ధ్య‌ మార‌కం లో ఈ కరెన్సీ కూడా చిరిగిపోవ‌డం జ‌రుగుతుంది....

More like this

Google Data Center: APకి వెళ్లడం వెనుక ఉన్న నిజాలు..

గత కొన్ని రోజులుగా గూగుల్ సంస్థ ఆంధ్రప్రదేశ్‌లో భారీ పెట్టుబడులు పెట్టబోతోందనే వార్తలు హాట్ టాపిక్‌గా మారాయి. ఈ...

Final Destination: Bloodlines – భయానక హారర్ ఇప్పుడు Jio Hotstar లో

భయానక సినిమాలు చూడటం ఇష్టమా? అయితే మీకు గుడ్ న్యూస్! ప్రముఖ హారర్ ఫ్రాంచైజీ “Final Destination” సిరీస్‌లో...

YouTube Down: కానీ ఎందుకు? కారణం తెలుసా?

ప్రపంచంలో ప్రతి రోజు కోట్ల మంది వీడియోలు చూసే YouTube ఒక్కసారిగా పనిచేయకపోవడం అమెరికాలో పెద్ద సమస్యగా మారింది....