ప్రముఖ దర్శకుడు క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో తాజాగా మంచి బజ్ క్రియేట్ అయిన సినిమా ఘాటి.. ఈ సినిమా గురించి డిజిటల్ వెబ్ మీడియా సోషల్ మీడియాలో విపరీతమైన చర్చ సాగింది, ఎందుకంటే చాలా కాలం తర్వాత ఇటు దర్శకుడు క్రిష్ అటు అనుష్క నుంచి వస్తున్న సినిమా కావడంతో, అంచనాలు ఎన్నో ఉన్నాయి. ఇక తమిళ నటుడు శివాజీ గణేషన్ మనవడు విక్రమ్ ప్రభు అనుష్క ఇద్దరు కీలక పాత్రలు పోషించారు.
చింతకింద శ్రీనివాస్ ఈ సినిమాకి కథని అందించారు. రేపు ఈ సినిమా గ్రాండ్ గా విడుదల అవుతోంది. తాజాగా సినిమా విడుదలకు ముందు రోజు అమెరికాలో ప్రీమియర్స్ పడతాయి. ఘాటీ ప్రీమియర్స్ కూడా అమెరికాలో ప్రదర్శించారు, ఇక్కడ నుంచి ఎలాంటి టాక్ వస్తుందో ఒక్కసారి చూద్దాం.
దర్శకుడు క్రిష్
అనుష్క విక్రమ్ ప్రభు
చింతకింద శ్రీనివాస్ కథ
మనోజ్ రెడ్డి కాటసాని సినిమాటోగ్రఫి,
తూర్పు చాణక్య రెడ్డి, నాగవెళ్లి విద్యాసాగర్ సంగీతం
రాజీవ్ రెడ్డి, సాయిబాబు జాగర్లమూడి నిర్మాణం
చైతన్య రావు మదాడి, జగపతిబాబు, జిషు సేన్ గుప్తా, జాన్ విజయ్, రవీంద్ర విజయ్, కీలక రోల్స్
ఈ సినిమా గురించి సూపర్ టాక్ వస్తోంది తాజాగా వినిపిస్తున్న టాక్ అయితే ఈ సినిమా పూర్తి కమర్షియలు యాక్షన్ డ్రామా అనే అంటున్నారు. ఇక అనుష్క యాక్షన్ చాలా బాగుంది అంటున్నారు. ఎమోషనల్ ఇంటెన్స్ గా ఈ సినిమా ఉంది అనే టాక్ సంపాదించుకుంది అమెరికాలో. ఇక సినిమా ఫస్ట్ హాప్ అంతా చాలా ఎమోషనల్ గా సాగింది అంటున్నారు. సెకండాఫ్ చాలా యాక్షన్ సీన్స్ అదరగొట్టాయి. పవర్ ప్యాక్ అంటే సెకండాఫ్ అనే చెప్పాలి.
అనుష్క శెట్టికి, డైరెక్టర్ క్రిష్‌కు ఈ సినిమా కమ్ బ్యాక్ మూవీ అంటున్నారు అందరూ.
అనుష్క శెట్టి శీలావతి అనే పాత్రలో మెస్మరైజ్ చేసింది, ఇక తెలుగులో విక్రమ్ ప్రభు ప్రేక్షకులకి తొలిసారి పరిచయం అయ్యాడు. అతని నటనతో సూపర్ ఫేమ్ వస్తుంది ఈ సినిమాలో అంటున్నారు అందరూ.
రైల్వే స్టేషన్ యాక్షన్ ఎపిసోడ్ సినిమాకి పీక్స్ సీన్ అనే చెప్పాలి. శీలావతి అనే ఓ మహిళ బాధితురాలి నుంచి క్రిమినల్‌గా అక్కడి నుంచి ఓ లెజెండ్ గా ఎలా ఎదిగింది అనేది ఘాటీ సినిమా స్టోరీ
వీఎఫ్ఎక్స్ వర్క్ చాలా బాగుంది.. ఇక నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి అనే టాక్ వచ్చింది.రియలిస్టిక్ ఫ్లేవర్ కోసం చాలా వరకు ఒరిజినల్ లొకేషన్లలోనే చిత్రీకరించారు. ఇక దర్శకుడు క్రిష్ అయితే ఈ సినిమా కోసం ఎంత కష్టపడ్డారో ప్రతీ ఫ్రేమ్ లో కనిపిస్తుంది.ఇప్పటి వరకు తెలుగు తెరపై చూడనటువంటి కథ ఇది
సినిమాలో ఏడు యాక్షన్ సీన్లు ఒకదానికి మించి మరోకటి కంపోజ్ చేశారు.
ఈ సినిమా ప్రమోషన్స్ కి అనుష్క దూరంగా ఉన్నారు. క్రిష్ బిగ్ బాస్ అగ్నిపరీక్ష స్టేజ్ పైకి వెళ్లి మరీ ఈ సినిమాని ప్రమోట్ చేశారు. క్రిష్ పెట్టుకున్న నమ్మకం నిజం అయింది ఈ సినిమాకి ఓవర్సీస్ నుంచి మంచి పాజిటీవ్ టాక్ వస్తోంది.