టెక్ ప్రపంచం కొత్త పరుగులు తీస్తోంది, ఏఐ సరికొత్త ఆవిష్కరణలకు వేదిక అవుతోంది.
ప్రముఖ టెక్నాలజీ దిగ్గజం గూగుల్ తాజాగా మరో కీలక అప్ డేట్ విషయం తెలియచేస్తోంది. సాధారణంగా ఫోన్లో నెట్ ఉంటేనే మనకు చాలా వరకూ యాప్స్ పనిచేస్తూ ఉంటాయి.
బ్యాగ్రౌండ్ లో సర్వర్ వర్క్ జరుగుతుంది. కాబట్టి కచ్చితంగా నెట్ ఉండాల్సిందే..తాజాగా గూగుల్ ఏఐ ఎడ్జ్ గ్యాలరీ పేరిట ఓ కొత్త AI యాప్‌ను తీసుకొచ్చింది. ఇప్పుడు మార్కెట్లో ఎన్నో ఏఐ యాప్స్ ఉపయోగిస్తున్నాం అయితే ఈ యాప్ స్పెషాలిటీ ఏమిటి అంటే మీ ఫోన్లో ఎలాంటి ఇంటర్ నెట్ లేకపోయినా ఈ యాప్ యూస్ చేసుకోవచ్చు.
ఏఐ ఎడ్జ్ గ్యాలరీ యాప్ కి ఎలాంటి నెట్ అవసరం లేదు. మీరు హ్యాపీగా మీ ఫోన్లో యూస్ చేసుకోవచ్చు. మీరు ఏఐ ఫోటోలు ఈ యాప్ తో ఇమేజ్ లు క్రియేట్ చేయవచ్చు.
మీరు సొంతంగా కోడ్ రాయవచ్చు, సమాధానాలు తెలుసుకోవచ్చు. ఇక చాలా యూసర్ ఫ్రెండ్లీగా అలాగే ప్రైవసీ ఉంది. అంతేకాదు సెక్యూరిటీ విషయంలో కూడా ఎలాంటి ఇబ్బంది ఉండదు.
అయితే యూజర్లు అందించే డేటా క్లౌడ్ సర్వర్లకు వెళ్లకుండా మొత్తం మన ఫోన్ లో బ్యాక్ ఎండ్ లోనే రన్ అవుతుంది. దీని వల్ల ఎలాంటి సెక్యూరిటీ ఇబ్బందులు ఉండవు.
మన డేటా చోరీ అవుతుంది అనే బెంగా ఉండదు. సాధారణంగా ఏఐ సమాధానాల కోసం వేచి చూడాలి కానీ చాలా తక్కువ సెకన్ల వ్యవధిలోనే మీకు పూర్తి కంటెంట్ సమాధానాలు అందిస్తుంది ఈ Google AI Edge Gallery..
ఇక మరో విషయం Google AI Edge Gallery యాప్ గెమ్మా 31బీ అనే లాంగ్వేజ్ మోడల్‌పై ఆధారపడి పనిచేస్తుంది. ఇది చాలా చిన్న సైజ్ 500 ఎంబీ మాత్రమే, కానీ వర్క్ మాత్రం హై రేంజ్ లో చేస్తుంది.ఇది కంటెంట్ క్రియేట్ చేయడంలో చాలా వేగంగా పనిచేస్తుంది. దాదాపు ఒక సెకనుకి 2580 టోకెన్స్ ప్రాసెస్ చేస్తుంది అని తెలియచేస్తున్నారు .. ఏఐ ఎడ్జ్ గ్యాలరీ యాప్ త్వరలో ఐఓఎస్ లో కూడా అందుబాటులోకి రానుంది.