SMలో గ్రోక్ AIతో మొదలైన బికినీ ట్రెండ్ భారతీయులను కూడా బాగా ప్రభావితం చేస్తోంది. సాధారణ దుస్తుల్లో ఉన్న ఫోటోలను ఒక్క కమాండ్‌తో బికినీల్లోకి మార్చేస్తోంది. హీరోయిన్లు, ఇతర సెలబ్రిటీలూ ఈ ట్రెండ్‌కు బలవుతున్నారు. కేంద్రం తీవ్రమైన ఆందోళన వ్యక్తం చేస్తూ, ఆ కంటెంట్ తొలగించాలని ఆదేశించింది.
ఫలితంగా కొంత వరకు తగ్గినా, ఇప్పుడు ఈ ట్రెండ్ తెలుగు స్టార్ హీరోలను కూడా తాకింది. ట్విట్టర్‌లో వారి ఫోటోలను కొందరు బికినీ లుక్‌ల్లోకి మార్చి పోస్ట్ చేస్తున్నారు. దీనిపై అభిమానుల్లో నిరసనలు వ్యక్తమవుతున్నాయి.
సైబర్ నేరాల పరిధిలోకి కూడా ఇవి వస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఎవరి అనుమతి లేకుండా ఇలాంటి మార్పులు చేయడం అవమానకరమైన వ్యవహారమని హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే కొన్ని ఫిర్యాదులు సైబర్ క్రైమ్ పోలీసుల వద్దకు వెళ్లినట్లు సమాచారం. సోషల్ మీడియాలో ఇలాంటి నకిలీ ఫోటోలను షేర్ చేయొద్దని విజ్ఞప్తి చేస్తున్నారు.