పవన్ కల్యాణ్ నటించిన హరిహర వీరమల్లు సినిమా ఇటీవల విడుదలైంది. ఈ సినిమా అనుకున్నంత సక్సస్ అవ్వలేదు..ఇక ఈ సినిమా పై ఎన్నో హోప్స్ పెట్టుకున్నారు అభిమానులు. అయితే పవన్ నటన అందరిని ఆకట్టుకుంది కాని దమ్మున్న కంటెంట్ కాదు అంటూ పెదవి విరిచారు ఫ్యాన్స్, అయితే ముందు ఈ సినిమాకి దర్శకుడు క్రిష్ చాలా వరకూ దర్శకత్వం వహించారు. సడన్ గా ఆయన సినిమా నుంచి తప్పుకున్నారు. తర్వాత నిర్మాత ఏఏం రత్నం తనయుడు జ్యోతికృష్ణ ఈ సినిమాకి దర్శకత్వం చేశారు. ముఖ్యంగా వీఎఫ్ఎక్స్ పై తీవ్ర విమర్శలు వచ్చాయి. అయితే తాజాగా దర్శకుడు క్రిష్ అసలు ఇంత పెద్ద సినిమా నుంచి ఎందుకు తప్పుకున్నారు అనే విషయం బయటపెట్టారు.
టాలీవుడ్ లో క్రియేటివిటీ ఉన్న మేటి దర్శకుల్లో క్రిష్ ఒకరు. ఆయన సినిమాలు ఆలోచింపచేస్తాయి మంచి కథనం అలాగే స్క్రీన్ ప్లే బాగా ఆకట్టుకుంది. అలాంటిది పవన్ కల్యాణ్ తో ఈ సినిమా అని ప్రకటన రాగానే అందరికి కొత్త ఉత్సాహం వచ్చింది. సినిమా ప్రకటన వచ్చిన సమయంలో పవన్ ఇందులో బంధిపోటుగా కనిపిస్తారు అనే వార్తలు వినిపించాయి. మా పవర్ స్టార్ ఇప్పటి వరకూ ఇలాంటి రోల్ చేయలేదని ఇక క్రిష్ ఇందులో పవన్ని ఎంత బాగా చూపిస్తారా అని అందరూ ఎదురుచూశారు. కానీ ఏమైందో ఆయన సినిమా నుంచి ఒక్కసారిగా తప్పుకున్నారు.
ఈ పీరియాడిక్ యాక్షన్ డ్రామా దాదాపు 50 శాతం షూటింగ్ క్రిష్ పూర్తి చేశారు.
తర్వాత నిర్మాత రత్నం కుమారుడు దర్శకుడు జ్యోతికృష్ణ ఈ సినిమాను పూర్తి చేశారు. ఫలితంగా స్టోరీ నేరేషన్, కధా శైలి, విజన్ మారిపోయింది. ఇక సినిమా కూడా పెద్దగా ఆకట్టుకోలేదు అయితే క్రిష్ తప్పుకోవడం గురించి ఈ సమయంలో మరింత చర్చ సాగింది, తాజాగా క్రిష్ దీనిపై క్లారిటీ ఇచ్చారు.
నాకు పవన్ గారు అంటే చాలా ఇష్టం. అంతకు మించి ఆయనంటే ప్రత్యేకమైన గౌరవం. అందుకే ఆయనతో సినిమా అనగానే నేను చాలా సంతోషించాను. ప్రముఖ నిర్మాత ఏఎం రత్నంగారు అంటే నాకు చాలా ఇష్టం. ఆయనతో మంచి పరిచయం కూడా ఉంది. హరిహర వీరమల్లు సినిమా నుంచి తప్పుకోడానికి కారణం పూర్తిగా వ్యక్తిగతమన్నారు. ఏ విధమైన ఇతర సమస్యలు లేవని, తన వ్యక్తిగత పరిస్దితుల వల్ల మాత్రమే తప్పుకున్నారు. చిత్ర యూనిట్ నుంచి అలాగే ఎవరి నుంచి ఎలాంటి ఇబ్బంది లేదు. అందరూ నాకు తోటి స్నేహితులు మంచి మిత్రులు లాంటి వారు. దీని వెనుక మరే కారణం లేదని తెలిపారు క్రిష్.
కేవలం వ్యక్తిగత పరిస్థితుల వల్లనే తప్పుకోవల్సి వచ్చిందన్నారు.
జులై 24 థియేటర్లలో గ్రాండ్ విడుదలైంది పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమా
ఈ మూవీ మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఎ.ఎం.రత్నం నిర్మించారు
క్రిష్, జ్యోతి కృష్ణ దర్శకత్వం
పవన్ కళ్యాణ్‌తో, నిధి అగర్వాల్, అర్జున్ రాంపాల్, బాబీ డియోల్, అనుపమ్ కేర్ నటించారు.
వీఎఫ్ ఎక్స్ వర్క్ పై విమర్శలు రావడంతో కొన్ని సీన్లు తొలగించి సినిమాని విడుదలచేశారు.
గత ఐదు సంవత్సరాలుగా షూటింగ్ జరుపుకున్న ఈ మూవీకి తగిన ఫలితమే దక్కిందని ఫ్యాన్స్ తెలిపారు.
అన్నింటి కంటే పవర్ స్టార్ యాక్టింగ్ అదిరిపోయిందంటూ నెటిజన్లు పవన్ అభిమానులు నెట్టింట కామెంట్ల వర్షం కురిపించారు..పవన్ కల్యాణ్ కెరీర్‌లోనే అత్యధిక వసూళ్లు కొల్లగొట్టిన మూవీగా నిలిచింది. వీరమల్లుకు బెనిఫిట్ షోల ద్వారా రూ. 12.7 కోట్ల నెట్ వస్తే మొదటిరోజు ప్రపంచవ్యాప్తంగా రూ.50 కోట్ల కలెక్షన్స్ వచ్చింది.