ఈ రోజుల్లో ప్రతీ ఒక్కరికి బ్యాంకు ఖాతా ఉంటోంది. అయితే మధ్యతరగతి అలాగే పేదలకు మన దేశంలో ఎక్కువ బ్యాంకు ఖాతాలు ఉన్నాయి. దేశంలో ఉన్న ప్రభుత్వ – ప్రైవేట్ రంగ బ్యాంకులు ఒక్కో బ్యాంకు ఒక్కో విధంగా ఆ ఖాతాదారులకి మినిమం బ్యాలెన్స్ అనేది మెయింటైన్ చేయాలి అని కండిషన్ పెడుతూ ఉంటాయి. అయితే కొన్ని బ్యాంకులు ఇటీవల అస్సలు బ్యాలెన్స్ లేకపోయినా పర్వాలేదు కాని, ప్రతీ మూడు నెలలకి ఒకసారి అయినా ట్రాన్సాక్షన్ జరగాలి అని తెలియచేస్తున్నాయి. కానీ కొన్ని బ్యాంకులు మాత్రం కచ్చితంగా మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేయాల్సిందే అని ఖాతాదారులని అలర్ట్ చేస్తున్నాయి. ఒకవేళ అకౌంట్ హోల్డర్ ఖాతాలో మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేయకపోతే ఛార్జెస్ కూడా విధిస్తున్నాయి.
దేశ వ్యాప్తంగా ఎప్పటి నుంచో ఖాతాదారులు ఈ విధానాన్ని వ్యతిరేకిస్తూనే ఉన్నారు. ప్రభుత్వ బ్యాంకులు, సహకార బ్యాంకులు ఖాతాదారులకి చాలా తక్కువ నగదు మాత్రమే అకౌంట్లో మెయింటైన్ చేస్తే చాలు అని తెలియచేస్తున్నాయి. ముఖ్యంగా ఈ కార్పొరేట్ బ్యాంకులు, ప్రైవేట్ బ్యాంకులు మినిమం బ్యాలెన్స్ అనేది భారీగా అకౌంట్లో ఉంచాలి అని తెలియచేస్తున్నాయి.
ఇటీవల కనీస బ్యాలెన్స్ పరిమితిని ఐసీఐసీఐ బ్యాంక్ గరిష్ఠంగా రూ.50 వేలకు పెంచింది. దీని గురించి పెద్ద ఎత్తున జనం మాట్లాడుకుంటున్నారు. ఎన్నో విమర్శలు చేస్తున్నారు. ఇది ఫిక్సిడ్ డిపాజిట్ చేస్తే ఎంత వడ్డీ వస్తుందో తెలుసా అంటూ కొందరు సటైర్లు వేస్తున్నారు. అయితే బ్యాంకులు కచ్చితంగా ఆర్బీఐ ఇచ్చే గైడ్ లైన్స్ పాటించాల్సిందే. మరి దీనికి గైడ్ లైన్స్ లేవా అంటే? ఈ విషయం పై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ సంజయ్ మల్హోత్రా స్పందించారు.
మినిమమ్ బ్యాలెన్స్ ఎంత ఉండాలనేది పూర్తిగా బ్యాంకుల నిర్ణయమని చెప్పారు. దీనిపై ఆర్బీఐ నియంత్రణ ఏమీ ఉండదు అని తెలియచేశారు. ఇది పూర్తిగా ఆయా బ్యాంకులు తీసుకునే నిర్ణయం అని తెలియచేశారు. కొన్ని బ్యాంకులు పదివేలు నిర్ణయించాయి, మరికొన్ని ఐదు వేలు నిర్ణయించాయి, ఇంకొన్ని రెండు వేలు నిర్ణయించాయి. అయితే దీనిపై ఆర్బీఐ ఎలాంటి నియంత్రణ లేదని తెలియచేశారు.
దీనిపై చాలా మంది కచ్చితంగా ప్రభుత్వ బ్యాంకులకి – ప్రైవేట్ బ్యాంకులకి వేరు వేరుగా అకౌంట్లో కనీస నిల్వ మెయింటైన్ చేయాల్సిన అంశం పై నియంత్రణ ఉండాలని కోరుతున్నారు.
దేశ వ్యాప్తంగా దీనిపై పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేస్తున్నారు. బ్యాంకుల విషయంలో అన్ని నిర్ణయాలు తీసుకునే ఆర్బీఐ పేదలకు మధ్యతరగతి ప్రజలకు ఎంతో మేలు చేసే ఈ నిర్ణయం పై పునరాలోచించాలి అంటున్నారు.
అయితే ఫైనాన్షియల్ అనలిస్టులు మాత్రం ఇది మనదేశంలోనే కాదు విదేశాల్లో కూడా ఉన్నా రూల్, అక్కడ కూడా బ్యాంకులు ఇలాంటి కనీస నగదు నిల్వలపై ఛార్జెస్ విధిస్తాయి అని తెలియచేస్తున్నారు. ఒకవేళ ఈ రూల్ పెట్టకపోతే బ్యాంకులు చాలా వరకూ నష్టపోతాయి అంటున్నారు అనలిస్టులు.