బెట్టింగ్ యాప్స్‌కు తనకు సంబంధం ఉందన్న ఆరోపణలను ఐబొమ్మ రవి ఖండించారు. ఈ ఆరోపణలు పూర్తిగా అవాస్తవాలని స్పష్టం చేశారు. నాంపల్లి కోర్టులో హాజరైన తర్వాత మీడియాతో మాట్లాడిన ఆయన, తనపై వస్తున్న ప్రచారంపై అసంతృప్తి వ్యక్తం చేశారు.
రవి ఏమి చెప్పడంటే…
“నా పేరు ఐబొమ్మ రవి కాదు, ఇమందిరవి. పోలీసులు చెబితే నేరం చేసినట్టేనా? నేను ఎక్కడికీ పారిపోలేదు.కూకట్పల్లి లోనే ఉన్నాను. వేరే దేశంలో సిటిజన్షిప్ మాత్రమే తీసుకున్నాను. సరైన సమయంలో వాస్తవాలు బయట పెడతా. ఏదైనా కోర్టులోనే తేల్చుకుంటాను” అని తెలిపారు.
బెట్టింగ్ యాప్‌లతో తనకు సంబంధమే లేదని సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం తప్పుదారి పట్టిస్తున్నదని, తన వ్యక్తిత్వాన్ని దెబ్బతీయడానికి కొన్ని వర్గాలు ప్రయత్నిస్తున్నాయని, రవి పేర్కొన్నడు. చట్టంపై తనకున్న నమ్మకంతోనే కోర్టుకు హాజరయ్యానని, తప్పు చేయలేదనే నమ్మకం ఉందని. తాను పరారీలో ఉన్నట్లు వార్తలు రాయడం పూర్తిగా తప్పుడు ప్రచారమని అన్నారు.“తప్పుడు ఆరోపణలు చేసి ఎవరి జీవితాలను నాశనం చేయొద్దు. సమయం వచ్చినప్పుడు నిజాలు అన్ని బయటపడతాయి” అని ఆయన వ్యాఖ్యానించారు.