భారత రైల్వే చరిత్రలో మరో అద్భుత ఫలితం ఆవిష్కరణకు సిద్ధమైంది. హర్యానాలోని జింద్–సోనీపట్ మధ్య 89 కిలోమీటర్ల మేర దేశంలోనే తొలి హైడ్రోజన్ రైలు త్వరలో ప్రయాణం కానుంది.
ఇందుకోసం జింద్‌లో దేశంలోనే అతిపెద్ద హైడ్రోజన్ ప్లాంట్‌ను ఏర్పాటు చేశారు. ఈ రైలు పూర్తిగా నీటి ఆవిరి, వేడినే మాత్రమే విడుదల చేస్తుంది కాబట్టి పర్యావరణానికి ఎలాంటి హానీ కలగదు, కార్బన్ ఉద్గారాలు శూన్యానికి సమానం.
ఇది ఫ్యూచర్ ట్రాన్స్‌పోర్ట్‌గా భావిస్తున్నారు. ఈ రైలు ఆపరేషన్ విజయవంతమైతే దేశంలోని మరిన్ని రూట్లలో కూడా హైడ్రోజన్ రైళ్లను నడపాలని రైల్వే శాఖ లక్ష్యంగా పెట్టుకుంది.
ఇంధన వ్యయం భారీగా తగ్గడం, శబ్ద కాలుష్యం తగ్గడం వంటి లాభాలు ఉండనున్నాయి. ప్రయాణికులకు ఆధునిక సదుపాయాలతో ఈ రైలును రూపొందిస్తున్నట్లు అధికారులు తెలిపారు.