ఆధునిక యుద్ధతంత్రంలో భారత్ మరో ముందడుగు వేసింది. పాక్, చైనా సరిహద్దుల్లో మెరుగుదాడులు చేపట్టేందుకు భారత్ భైరవ్ పేరుతో అత్యంత శక్తివంతమైన ఫోర్స్‌ను రంగంలోకి దించింది. ఈ దళం కోసం లక్ష మందికి పైగా ‘డ్రోన్ ఆపరేటర్లను’ సిద్ధం చేసింది.
సాధారణ సైన్యానికి, స్పెషల్ ఫోర్సెస్‌కు మధ్య వారధిలా పనిచేసే ఈ భైరవ్ కమాండోలు శత్రుపక్ష శివిరాలను డ్రోన్ సాయంతో క్షణాల్లో నేలమట్టం చేయగలరు.
భైరవ్ యూనిట్లో అత్యాధునిక సెన్సర్లు, నైట్‌విజన్, థర్మల్ ఇమేజింగ్ పరికరాలు, లాంగ్రేంజ్ డ్రోన్లు, ఆర్టిల్లరీ సపోర్ట్ సిస్టమ్స్ లాంటి సౌకర్యాలు ఉంటాయి.
సరిహద్దుల వెంట గూఢచార కార్యకలాపాలు, టెర్రరిస్ట్ నిలయాలు గుర్తించడం, శస్త్రాస్ర నిల్వలను ధ్వంసం చేయడం ఈ దళం ప్రధాన బాధ్యతలు. భవిష్యత్ యుద్ధాల్లో డ్రోన్ వార్ఫేర్ కీలకమవుతుందని భావించి, భారత ఆర్మీ ఈ దళాన్ని ప్రత్యేకంగా రూపొందించింది.