
నిన్న రాత్రి పాకిస్తాన్ కు సంబంధించిన F-16(fighter -16) మరియు JF-17 (jet fighter-17) మన మిలటరీ ఆకాశంలో కూల్చి వేశారు.
అసలు F-16 అంటే ఏమిటి, దీన్ని పాకిస్తాన్ ఎక్కడ నుంచి కొనుగోలు చేసింది. అసలు దీని ప్రత్యేకతలు ఏమిటి ,ఇక్కడ తెలుసుకుందాం.
General Dynamics (GD) ఇది ఒక అమెరికన్ కంపెనీ , దీన్ని 1952 లో Reston,Virginia, USA.
లో నెలకొల్పారు.
ఈ కంపెనీ ఏరోస్పేస్ మరియు డిఫెన్స్ సంబంధించిన అన్ని రకాల ఉత్పత్తులు తయారు చేసి వివిధ దేశాలు కి అమ్మడం జరుగుతుంది.
F- 16 అంటే F (fighter) 16 అనేది మోడల్ నెంబర్ . F-16 ,1970 లో డెవలప్ చేసి 1974 వరకు పూర్తి చేశారు.
అప్పటి నుంచి కూడా వీటిని డిమాండ్ మేరకు తయారు చేసి వివిధ దేశాలకు అమ్ముతున్నారు .
కానీ Genral Dynamics (GD) 1993 లో Lockheed Corporation అనే కంపెనీ F-16 ప్రొడక్షన్ నీ కొనుగోలు చేసింది.
ఇప్పుడు F-16 సంబంధించిన ప్రొడక్షన్ మరియు అమ్మకాలు అన్ని Lockheed Martin చేతిలో ఉన్నాయి.
Lockheed Corporation మరియు Martin Marietta ఈ రెండు కంపెనీలు 1995 merge చేసి Lockheed Martin గా పేరు మార్చారు .

F-16 కాస్ట్ ,120 నుంచి 160 మిలియన్ లో ఉంటుంది. దీనిలో చాలా రకాల ఉత్పత్తులు ఉన్నాయి. ఒక్కో దేశానికి ఒక్కో విదమయిన అగ్రిమెంట్ తో ఉత్పత్తులు అందచేస్తారు.
JF-17 jet fighter. చైనా(China’s Chengdu Aerospace Corporation) మరియు పాకిస్తాన్ (Pakistan Aeronautical Complex) రెండు దేశాల కలయికతో పరస్పర సంబంధాలతో అంగీకారంతో j- 17 విమానాలు తయారు చేయడం జరిగింది.
దీని డెవలప్మెంట్ 1990 లో మొదలయ్యింది.దీని ప్రత్యేకత ఏమిటంటే (Pakistan Air force)చాలా తక్కువ ఖర్చుతో మరియు మోడర్న్ Technology ఉపయోగించి చేయడం.
MIG -21 మరియు F-7 Replace చేయడం కోసం ఇ ప్రాజెక్ట్ మొదలు పెట్టారు .దీని స్పీడ్ 1100 Km/h.
ఇందులో 3 వెర్షన్లు వచ్చాయి.
JF-Block I మొదటిది బేసిక్ వెర్షన్ 2007 రిలీజ్ చేశారు . JF-Block II రెండవది 2015 లోనూ JF-Block III మూడవది 2020 లోనూ ఉత్పత్తులు తయారు చేశారు.

JF-17 థండర్ అనేది తక్కువ ఖర్చుతో కూడుకున్న, బహుముఖ యుద్ధ విమానం. ఇది ఎయిర్ ఫోర్స్ అవసరాలను తీర్చడానికి, ముఖ్యంగా తక్కువ బడ్జెట్ ఉన్న దేశాల కోసం డిజైన్ చేయబడింది.
బహుముఖ పాత్రలు నిర్వహించే సామర్థ్యం, ఆధునిక ఎవియానిక్స్ మరియు ఆయుధలతో కలిపిన, అధునాతన యుద్ధ విమానం .

Discover more from TeluguPost TV
Subscribe to get the latest posts sent to your email.