సాధారణంగా రైలులో ప్రయాణం చేసేటప్పుడు ఏసీ కోచ్ లో ప్రయాణం చేసే సమయంలో, ఒక్కోసారి ఏసీలు పనిచేయకపోవడం ఇలాంటి కంప్లైంట్లు వస్తూ ఉంటాయి.
అయితే రైల్వే అధికారులకి అక్కడ టెక్నిషియన్లకి తెలియచేస్తే వెంటనే వారు సమస్య పరిష్కరిస్తారు. తాజాగా ఇటీవల ఇలాంటి ఘటన జరిగింది. అయితే ఆ ఏసీ వర్క్ అవడం లేదని బ్లాక్ ఓపెన్ చేసి చూసి అధికారులు షాక్ అయ్యారు. అసలు ఏం జరిగింది అంటే.
ఏసీ నుంచి గాలి రావడం లేదని ఫిర్యాదు చేస్తే, టెక్నీషియన్లు దాన్ని తెరిచి చూడగా లోపల వందల కొద్దీ విస్కీ బాటిళ్లు కనిపించాయి.
వార్నీ ఇదేం పనిరా అని అందరూ షాక్ అయ్యారు. లక్నో-బరౌనీ ఎక్స్‌ప్రెస్ రైలులోని ఏసీ-2 టైర్ కోచ్‌లో ఈ ఈ ఘటన అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది.
ప్రయాణికులు ఎంత సేపు అయినా చల్లగాలి రావడం లేదు అని కంప్లైంట్ ఇచ్చారు. వెంటనే టెక్నికల్ సిబ్బంది, కోచ్‌లోని 32, 34 నంబర్ బెర్తుల పైన ఉన్న ఏసీ డక్టును తెరిచి చూశారు. అక్కడ ఏసీ డెక్ లో కొన్ని న్యూస్ పేపర్లలో విస్కి బాటిల్లు పెట్టి ఉన్నాయి ఏసీ గాలి రాకుండా అడ్డుగా అవి పెట్టి ఉంచారు. అధికారులు ఆ అక్రమ మద్యాన్ని స్వాధీనం చేసుకుని, కోచ్ మొత్తం తనిఖీలు చేపట్టారు.
అయితే ఇది కోచ్ లో సిబ్బంది ఎవరైనా చేశారా దీని వెనుక ఎవరు ఉన్నారు అనేదానిపై విచారణ చేస్తున్నారు అధికారులు. ఈ వీడియో కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
బీహార్‌లో 2016 నుంచి సంపూర్ణ మద్యపాన నిషేధం అమల్లో ఉంది. అయితే కళ్లుగప్పి ఈ విధంగా మద్యం తీసుకువెళుతున్నారు కొందరు. ఈ కోణంలో అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.
రోడ్లు చెక్ పోస్టుల దగ్గర పూర్తిగా చెకింగ్ జరుగుతోంది. అయితే ఇలా రైలులో బల్క్ గా ఇలా మద్యం అక్రమంగా తరలించడం మాత్రం ఇదే తొలిసారి అని అంటున్నారు అధికారులు. అయితే ఇక్కడ మరో విషయం ఏమిటి అంటే? రైల్వే యార్డులోనే సిబ్బంది ప్రమేయంతో ఈ మద్యం లోడ్ చేసి ఉంటారని అనుమానాలు వస్తున్నాయి.