గత ఏడాది నిరాశపరిచిన భారత షట్లర్స కొత్త సీజన్‌కు సిద్ధమయ్యారు. నేటి నుంచి జరగే మలేషియా ఓపెన్ సూపర్ 1000 టోర్నీలో బరిలో దిగనున్నారు.
మెన్స్ సింగిల్స్‌లో కిదాంబి శ్రీకాంత్, లక్ష్యసేన్, ప్రణయ్ పోటీలో పాల్గొంటారు. ఉమెన్స్ సింగిల్స్‌లో పీవీ సింధు బరిలోకి దిగుతోంది. డబుల్స్‌లో సాత్విక్–చిరాగ్ జోడీ, పునీత జోడీ సహా పలువురు భారత క్రీడాకారులు ఆడనున్నారు.
అక్టోబర్ తర్వాత సింధు ఆడబోయే మొదటి టోర్నీ ఇదే కావడంతో ఆమె ఎలా రాణిస్తారో చూడాలి. టోర్నీలో తొలి రౌండ్ల నుంచే కఠినమైన పోటీలు ఎదురుకానున్నాయి.
ప్రపంచ ర్యాంకింగ్స్‌ను దృష్టిలో పెట్టుకుని ఈ టోర్నీ కీలకంగా భావిస్తున్నారు. మంచి ప్రదర్శన కనబరిస్తే రాబోయే ఆల్ ఇంగ్లాండ్, ఇండోనేషియా ఓపెన్లలో సీడింగ్ అవకాశాలు మెరుగయ్యే అవకాశం ఉంది.