
ఎండాకాలం అంటే తప్పకుండా తినాల్సిన ప్రూట్ పుచ్చకాయ. వాటర్ కంటెంట్ అధికంగా ఉండే ఈ పండును పిల్లల్ని నుంచి పెద్దల వరకు ఇష్టంగా తింటుంటారు. అయితే ఈ మధ్య ఈ పండ్లను కల్తీ చేస్తున్నారు కొందరు. కాయ త్వరగా పండటానికి.. లోపల ఎర్రగా ఉండటానికి ఇంజక్షన్స్ చేయడంతో పాటు కెమికల్స్ వాడుతున్నారు. అలాంటి పండ్లను తింటే హెల్త్ ప్రాబ్లమ్స్ రావడం పక్కా.. అందుకే పుచ్చకాయను కొనేప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.
అయితే చిన్న పుచ్చకాయ ముక్కను నీటిలో కలపాలి. వెంటనే నీరు గులాబీ రంగులోకి మారుతుందో లేదో గమనించాలి. నీరు గులాబీ రంగులోకి మారితే, అది రసాయన పుచ్చకాయని అర్ధం. ఒకవేళ పండు గులాబీ రంగులోకి మారకుంటే అందులో దా కృత్రిమ రంగు కలిపలేదని అర్థం. అలాగే పండును టిష్యూ పేపర్‌తో నొక్కి చూడవచ్చు. కాగితం ఎర్రగా మారితే, అది కల్తీ పుచ్చకాయ అని అర్థం. రంగు రావడానికి ఇంజెక్ట్ చేసిన పుచ్చకాయ తినడం వల్ల ఫుడ్ పాయిజనింగ్ వంటి సమస్యలు వస్తాయి. వాంతులు, విరేచనాలు వంటి సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంది.
ఇది జీర్ణక్రియను ప్రభావితం చేసే అవకాశం ఉంది. కల్తీ పుచ్చకాయ తినడం వల్ల జీర్ణక్రియపై ప్రతికూల ప్రభావాలు పడతాయి. అలాగే రసాయనాలతో కూడిన పుచ్చకాయ తినడం వల్ల ఆకలిగా అనిపించదు. దీంతో గ్యాస్ట్రిక్ సమస్యలు వస్తాయి. పుచ్చకాయ తిన్నతర్వాత అలసట, దాహంగా అనిపించడం జరుగుతుంది. రసాయనిక రంగు వేసిన పుచ్చకాయ తినడం వల్ల మూత్రపిండాలపై కూడా ప్రతికూల ప్రభావం పడుతుంది. అందువల్ల ఇంజెక్ట్ చేసిన పుచ్చకాయను గుర్తించి వీటిని కొనకపోవడమే మంచిది.
Discover more from TeluguPost TV
Subscribe to get the latest posts sent to your email.